ఏమిటీ రాక్షసత్వం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
చెన్నై : శ్రీలంకలోని తమిళులపై లంక సైన్యం జరిపిన అకృత్యాలను నిరసిస్తూ సౌతిండియా సినీపరిశ్రమకు చెందిన కళాకారులంతా చెన్నైలో ఒకరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. యుద్ద నేరాలకు పాల్పడిన శ్రీలంక ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేసారు. శరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు, సూర్య, కార్తి, శివకుమార్, సత్యరాజ్ ఇతర తమిళ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు.
శ్రీలంకలోని జాఫ్నా, కిలినోచ్చి ప్రాంతాల్లో లంక సైన్యం సృష్టించిన మారణ హోమం తాలూకు చిత్రాలను అంతర్జాతీయ మీడియా ఇప్పటికే బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఎల్టీటీఈపై యుద్ధంలో శ్రీలంక సైన్యం మానవ హక్కులను మంటగలిపింది. యుద్ధం పేరుతో అక్కడ తమిళుల ఊచకోత జరిపింది.
ఫిబ్రవరి 18వ తేదీన బ్రిటన్‌కు చెందిన ఛానల్-4 కథనం ప్రసారమైన తర్వాత... తమిళనాడులో కదలిక మొదలైంది. ఆ కదలిక ఇప్పుడు ఉద్యమంగా, మహోద్యమంగా మారుతోంది. దులో భాగంగానే తమిళ సినీ కళాకారులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
ఆందోళన కార్యక్రమంలో రజనీకాంత్

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
నిరాహార దీక్షలో కార్తి, సూర్య, శివకుమార్

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
నిరాహార దీక్షలో పాల్గొన్న హీరో అజిత్ కుమార్

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
మీడియతో మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
ఆందోళన కార్యక్రమంలో హీరో ధనుష్

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
ఆందోళన కార్యక్రమంలో పవర్ స్టార్ శ్రీనివాసన్

ఏమిటీ రాక్షసత్యం...!(రజనీకాంత్, సూర్య, కార్తి నిరాహారదీక్ష)
ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సినీ ప్రముఖులు

Click it and Unblock the Notifications