విశాల్, కార్తీలను చంపుతామని బెదిరింపులు.. తమిళ నటుడిపై కేసు నమోదు!
తమిళనాడు నడిగర్ సంఘం ఎన్నికలు గతంలో ఎంత పెద్ద వివాదాన్ని సృష్టించాయో, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వాయిదా పడిన ఈ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతానికి హీరోలు విశాల్, కార్తీలు నడిగర్ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వారిని చంపుతానని కొలీవుడ్ నటుడు ఒకరు బెదిరించినట్లుగా నడిగర్ సంఘం అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

నడిగర్ సంఘం
టాలీవుడ్ లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత కాక సృష్టించాయో తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు కూడా దాదాపు అంతే వివాదాన్ని సృష్టించాయి. రెండు వర్గాలుగా విడిపోయిన నటీనటులు, మేము గెలిచామంటే మేము గెలిచామంటూ పెద్ద ఎత్తున వివాదాల సృష్టించారు. దీంతో ఎన్నికలు కూడా అప్పటికప్పుడు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. చివరికి కోర్టు ఆదేశాలతో ఈ ఎన్నికలలో నాజర్ సంఘం గెలిచినట్లు ప్రకటించారు.

పోలీసులకు ఫిర్యాదు
నాజర్ బృందంలో హీరోలు విశాల్, కార్తీలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మీద అక్కసు పెంచుకున్న రాజదురై అనే ఒక నటుడు వారిద్దరిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వారిని చంపేస్తానని కూడా సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నాడని నడిగర్ సంఘం అధికారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్ ప్రొటెక్షన్ కూడా
సోషల్ మీడియాలో, విశాల్ కార్తిలను చంపేస్తానని బెదిరించడమే కాక వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి వారి అభిమానులైన పలువురిని రెచ్చగొడుతున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజు దొరై మీద కఠిన చర్యలు తీసుకొని ఇకమీదట ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాక హీరో విశాల్ కార్తీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

గాయాలు పాలు
ఇక ధర్మరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన సదరు నటుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇక సినిమాల పరంగా కూడా విశాల్, కార్తీ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. విశాల్ ఈ మధ్యనే మరోసారి గాయాల పాలయ్యాడు. ఇటీవల కాలంలో ఆయన హీరోగా నటిస్తున్న పలు సినిమా షూటింగ్స్ లో భాగంగా పలుసార్లు గాయాల పాలవగా తాజాగా లాఠీ అనే సినిమా షూటింగ్ సమయంలో కూడా గాయాలు పాలయ్యాడు.

అభిమానుల ఆందోళన
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయిన సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. కార్తీ విషయానికి వస్తే ఆయన మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పోనియన్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక విక్రమ్ సినిమా పూర్తి అయిన నేపథ్యంలో ఖైదీ సీక్వెల్ మీద కూడా లోకేష్ కనగరాజ్ దృష్టి పెట్టాడని అందులో కూడా కార్తి హీరోగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయం మీద అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది మొత్తం మీద ఈ ఇద్దరు హీరోలకు హత్యా బెదిరింపులు రావడంతో వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











