తమిళ సినిమా నటులు మలేషియాలో నిర్వహించిన స్టార్ నైట్ ఇద్దరు హీరోల గొడవకు వేదికగా నిలిచింది. ఆ హీరోలిద్దరూ గొడవపడింది ఒక హీరోయిన్ గురించి. ఆ హీరోలు విజయ్, శింబులు. హీరోయిన్ గురించి ఎందుకు కానీ శింబూ ఆవేశంగా విజయ్ గల్లా పట్టుకుని బెదిరించాడుట. విజయ్ ఊరుకుంటాడా. ఊరుకోలేదు. వెంటనే శింబూను నెట్టివేశాడు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. విషయం ఏమంటే సదరు హీరోయిన్ ప్రస్తుతం విజయ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అందుకే శింబూకు కోపమట. ఈ జరిగిన గొడవేదో స్టేజీ మీదే జరిగితే ఎంత బావుండునో అని ఆ షోకు హాజరైన వారు అనుకున్నారట. రియల్ ఫైట్ ను మిస్ అయ్యామే అనుకున్నారట.