హీరోతో చెడిన లవ్ ఎఫైర్.. ఆపై వేధింపులు, పోలీస్ కమీషనర్‌కు హీరోయిన్ ఫిర్యాదు!
'పట్టాథారి' అనే తమిళ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన అదితి మీనన్, అభి శరవణన్ మధ్య ఏర్పడిన ప్రేమ బంధం పలుకారణాలతో తెగిపోయింది. అయితే అభి శరవణన్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో అదితి మీనన్ చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అభి శరవణన్ తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని.. అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా ఇందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కంప్లయింటులో తమ మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచినట్లు అదితి మీనన్ పేర్కొనడం గమనార్హం.

ప్రేమించుకున్నాం, కానీ..
‘పట్టాథారి' సినిమా సమయంలో తాము ప్రేమలో పడ్డ మాట నిజమే, అభి శరవణన్ తన ఫ్యామిలీకి కూడా నన్ను పరిచయం చేశాడని అదితి మీనన్ తెలిపారు. అయితే మా పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని కండీషన్ చెప్పినట్లు తెలిపారు.

అతడి నిజస్వరూపం తెలిసింది
అయితే కొన్ని రోజుల తర్వాత అభి శరవణన్ నిజస్వరూపం కొందరు అమ్మాయిల ద్వారా తెలిసింది. అతడి ద్వారా ఎంతోమంది అమ్మాయిలు మోసపోయిన విషయం తెలిసి షాకయ్యాను. ఈ విషయంపై అతడిని ప్రశ్నిస్తే నన్నుడామినేట్ చేయడం ప్రారంభించాడని పేర్కొన్నారు.

అతడితో రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావాలని..
అభి శరవణన్ గురించి తెలిసిన తర్వాత అతడితో రిలేషన్ షిప్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాను. కానీ అతడు నన్ను వేధించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని అదితి మీనన్ తెలిపారు.

ఇండస్ట్రీలో నా పేరు చెడగొడుతున్నాడు
నేను అతన్ని కాదనన్నానని... నాపై రివేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నాపై చెడు ప్రచారం చేస్తున్నాడు. ఇండస్ట్రీలో నా పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తనకు అతడి నుంచి రక్షణ కల్పించాలని అదితి మీనన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











