ఐశ్వర్యకు లైంగిక వేధింపులు.. న్యూడ్ ఫొటోలతో మెసేజ్‌లు.. ఫోన్ నెంబర్ పెట్టడంతో!
సీనియర్ నటి లక్ష్మీ తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. మహేశ్ బాబు, వెంకటేష్, నాగార్జున తదితర స్టార్ హీరోలందరికి తల్లి పాత్రలు చేసి చాలా పాపులర్ అయ్యారు. ఆమె కూతురు ఐశ్యర్య భాస్కరన్ కూడా మంచి నటిగా నిరూపించుకున్నారు.
పేరుకు తమిళ నటి అయినప్పటికీ తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పు పొందారు.అమ్మానాన్న తమిళ అమ్మాయి, నాని, కల్యాణ వైభోగం వంటి సినిమాల ద్వారా ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయితే ఐశ్వర్య లైంగిక వేధింపులకు గురి అయినట్లు తాజాగా ఓ వీడియోలో చెప్పుకొచ్చారు.

భర్తతో విడాకులు: సీనియర్ నటి లక్ష్మీ కూతురైన ఐశ్వర్య భాస్కరన్ దక్షిణ సినీ పరిశ్రమలో తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించారు. 1996లో భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఆమె కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. అడవిలో అభిమన్యుడు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అనంతరం మామ గారు, సీతాకోక చిలుకలు, నరసింహం వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.
అనేక సీరియళ్లలో: అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ తో సీతాపతి ఛలో తిరుపతి, ప్రేమ జిందాబాద్, సుబ్బరాయుడి పెళ్లి, అహంకారి, పెళ్లంటే నూరేళ్ల పంట, బ్రహ్మ, మనసు పలికే మౌనరాగం, పైసలో పరమాత్మ, శ్రీమహాలక్ష్మి వంటి తదితర సినిమాల్లో నటించారు ఐశ్వర్య భాస్కరన్. గార్డిష్ వంటి హిందీ చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్లో నటించి మెప్పు పొందారు.

లైంగిక వేధింపులు: ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్న ఐశ్వర్య భాస్కరన్ వెగాన్ వంటకాలు, సబ్పుల తయారీ, ఆధ్యాత్మిక అంశాల గురించి చర్చిస్తుంటారు. అయితే తాజాగా ఆమెకు ఆన్ లైన్ లో లైంగిక వేధింపులు మొదలు అయినట్లు ఓ వీడియోలో తెలిపారు. ఆమె ఫోన్ నెంబర్ కు అనుచిత సందేశాలు, అసభ్యకర ఫొటోలు పంపిస్తున్నారని నటి ఐశ్వర్య భాస్కరన్ ఆ వీడియో చెప్పుకొచ్చారు.
కస్టమర్స్ కోసం: కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు కూడా షేర్ చేస్తున్నారని, దాంతో తాను మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లు ఐశ్వర్య భాస్కరన్ వెల్లడించారు. అయితే సోప్ బిజినెస్ కోసం సోషల్ మీడియాలో తన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయడంతో ఈ వేధింపులు మొదలు అయ్యాయని అందులో ఆమె పేర్కొన్నారు. కస్టమర్స్ ఆర్డర్స్ ఇచ్చేందుకని ఫోన్ నెంబర్ షేర్ చేస్తే ఇలా హారాస్ మెంట్ జరుగుతుందన్నారు.
సబ్బుల వ్యాపారమే..: అయితే ఈ లైంగిక వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులుకు ఫిర్యాదు చేయాలని తాను కోరుకోవడం లేదని ఐశ్వర్య భాస్కరన్ చెప్పారు. కానీ ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వీడియో ద్వారా హెచ్చరించారు. ప్రస్తుతం నటిగా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సబ్బుల వ్యాపారమే ప్రధాన ఇన్ కమ్ సోర్స్ అయిందని తెలిపారు. ఇక వేధింపులకు సంబంధించిన వీడియో షేర్ చేయడంతో ఐశ్వర్యకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు.


Click it and Unblock the Notifications











