హీరోయిన్...క్యారెక్టర్ ఆర్టిస్టు...ఇప్పుడు దర్శకురాలు
చెన్నై : ఒక్కసారి పరిశ్రమలోకి ఎంటర్ అయితే మనలోని కళను ఏదో విధంగా ఎప్పటికప్పుడు బయిటపెడుతూ ఉండవచ్చు. దీనికి ఆడ,మొగ తేడా లేదని నిరూపిస్తున్నారు సిని రంగంలోని స్త్రీలు. హీరోయిన్ గా సిని పరిశ్రమకు పరిచయమై, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఇప్పుడు దర్శకురాలిగా అవతారమెత్తుతోంది ఐశ్వర్య. ఐశ్వర్య అంటే మరెవరో కాదు సీనియర్ నటి మిధునం ఫేమ్ లక్ష్మి కుమార్తె. ఆమె తెలుగులో మామగారు, సీతాపతి ఛలో తిరుపతి, నాని, ఆకాశమంత,బురిడి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి చిత్రాల్లో చేసారు.
మహిళా దర్శకురాళ్ల హవా మొదలైంది. శ్రీప్రియ, ఐశ్వర్య ధనుష్, సౌందర్య, కృతిక ఉదయనిధి వంటి దర్శకుల జాబితాలో మరో పేరు వచ్చి చేరనుంది. జయశంకర్, శివకుమార్ కాలంలో అందాల నటిగా పేరు తెచ్చుకున్నారు లక్ష్మి. హీరోయిన్‌గా మెప్పించిన ఆమె అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ హవా చాటుకుంది. ఆమె నట వారసురాలిగా వెండి తెరంగేట్రం చేసిన ఐశ్వర్య.. అమ్మ బాటలోనే తొలుత హీరోయిన్‌గా నటించారు.

ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టు అవతారమెత్తారు. ఇప్పుడు కొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే మెగాఫోన్ పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తాను దర్శకురాలిగా మారనున్న తొలి చిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా రాసేశారని సమాచారం. అత్యంత సన్నిహితులైనవారికి వాటిని చూపించి అభిప్రాయాలు సేకరించే పనిలో ఉన్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె దర్శకురాలిగా కనిపించనుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











