లాక్‌డౌన్‌లో అమలాపాల్ ఇంట్లో బర్త్ డే పార్టీ.. మ్యూజిక్, డ్యాన్సులతో హంగామా!
ఇటీవల కాలంలో వివాదంలో నిలుస్తున్న నటి అమలాపాల్ కరోనా లాక్‌డౌన్ పరిపూర్ణంగా పాటిస్తున్నారు. సామాజిక అంశాలపై స్పందిస్తూ భౌతికంగా దూరాన్ని పాటిస్తు్నారు. తాజాగా లాక్‌డౌన్‌లోనే సోదరుడి జన్మదిన వేడుకలను ఫుల్ జాలీగా జరుపుకొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అమలాపాల్ ఎలాంటి హంగామా చేశారంటే..

రెండో పెళ్లి వార్తల నేపథ్యంలో
ఇటీవల అమలాపాల్ రెండో పెళ్లి వ్యవహారం మీడియాలో సంచలనం రేపింది. బాలీవుడ్ సింగర్‌ను పెళ్లి చేసుకొన్నారంటూ ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడటంతో విపరీతమైన చర్చకు దారి తీసింది. అలాగే ఆ ఫోటోలు ఫేక్ అంటూ వెంటనే సన్నిహితులు ఖండించారు. ఆ తర్వాత ఆ ఫోటోలు పెళ్లిపై కూడా స్పందించారు.

పెళ్లి చేసుకొంటే చెబుతాను
సింగర్‌తో పెళ్లి వార్తలను అమలాపాల్ కొట్టిపడేశారు. అయితే ఆమె ప్రియుడు ఉద్ధేశపూర్వకంగానే పాత ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేసి కన్‌ఫ్యూజ్ చేశారనే క్లారిటీ ఇచ్చారు. అయితే తాను రెండో పెళ్లి చేసుకొంటే సీక్రెట్‌గా చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే అందరికీ తెలియజేసి వివాహం చేసుకొంటాను అని అమలాపాల్ క్లారిటీ ఇచ్చారు.

మహిళలను అలా చూడొద్దు
ఇటీవల లాక్‌డౌన్ ప్రముఖ రచయిత రాసిన నవలను చదివి ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా మహిళలను లైంగిక వాంఛలు తీర్చుకొనే వస్తువుగా చూస్తున్నారు. ఆమె గర్బం దాల్చితే ఎన్ని కష్టాలు పడుతారో మగాళ్లకు ఏం తెలుసు. ఒక కాన్పు కాగానే మరో కానుపు కోసం మగాళ్లు సిద్దమవుతారు. ఆడవాళ్ల పరిస్థితిని, ఆరోగ్యాన్ని కనీసం ఆలోచించరు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోదరుడి బర్త్ డే రోజున
ఇలాంటి పరిస్థితుల మధ్యలో అమలాపాల్ తన సోదరుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ముఖానికి మాస్క్ ధరించి టెలివిజన్ డీజే సెట్‌గా మార్చి డ్యాన్స్‌లతో హోరెత్తించారు. తన సోదరుడి బర్త్‌డేను ఎంజాయ్ చేస్తున్నాను అని కేరింతలతో అల్లరి చేశారు.
Recommended Video

ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో హల్‌చల్
ఇక ఇన్సాటాగ్రామ్‌లో అమలాపాల్ పోస్టు చేసి.. ఇది మాకు పార్టీ టైమ్. నా ప్రియమైన, అందమైన, ఫన్నీయస్ట్, వన్ అండ్ ఓన్లీ మా సోదరుడు అభిజిత్ పాల్ బర్త్ డే. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్ ధరించి పార్టీ చేసుకొన్నామని పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమలాపాల్ వీడియో, డ్యాన్స్ వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











