twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమలాపాల్ పెళ్లి అబద్ధం.. బ్రేకప్‌తోనే ప్రియుడు చీటింగ్.. పెళ్లి ఫోటోలు ఓ మిస్టరీ

    |

    అందాల భామ అమలాపాల్ రెండోపెళ్లిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిందర్ సింగ్‌తో వివాహం కాలేదనే వార్తలకు బలం పెరుగుతున్నది. అమలాపాల్‌ను ప్రియుడు చీట్ చేశాడానే విషయంపై ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. అయితే పెళ్లి వార్తలపై అటు అమలాపాల్ గానీ, భవిందర్ సింగ్ గానీ స్పందించకపోవడం, వారిద్దరూ అజాతంలోకి వెళ్లడంపై చాలా రకాల కన్‌ఫ్యూజన్ వ్యక్తమవుతున్నది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు మరింత అనుమానంగా మారాయి. అవేమిటంటే..

    ఉద్దేశపూర్వకంగానే మీడియాకు..

    ఉద్దేశపూర్వకంగానే మీడియాకు..

    కొద్దినెలలుగా అమలాపాల్, భవిందర్ సింగ్ సహజీవనం చేస్తున్నారనే వార్తలు మీడియాలో అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. అయితే వాటిని వారిద్దరూ ధృవీకరించినట్టు ఎక్కడా కనిపించలేదు. అయితే ఓ ఫేక్ అకౌంట్ ద్వారా భవిందర్ సింగ్, అమలాపాల్ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. అయితే వాటిని భవిందర్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే పోస్టు చేయించారనే విషయం మీడియాలో వచ్చింది.

     డిలీట్ చేయడంపై అనుమానాలు

    డిలీట్ చేయడంపై అనుమానాలు

    అలా జరిగిన కొద్ది రోజులకే భవిందర్ సింగ్ తన అధికారిక అకౌంట్‌లో పెళ్లి ఫోటోలు అంటూ పోస్టు చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వాటిని డిలీట్ చేయడం, ఆ ఫోటోలు వెంటనే పలు మీడియా సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై సన్నిహితులు కూడా తికమక పడుతున్నారు. తమకు చెప్పకుండా అమలాపాల్ పెళ్లి చేసుకోదనే మాటను వ్యక్తం చేస్తున్నారు.

     కొద్దిరోజుల క్రితమే బ్రేకప్

    కొద్దిరోజుల క్రితమే బ్రేకప్

    అమలాపాల్‌ పెళ్లిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తనకు సన్నిహితులుగా భావిస్తున్న కొందరు ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ.. అమలాపాల్, భవిందర్ సింగ్ డేటింగ్ చేస్తున్న మాట నిజమే. కానీ వారిద్దరూ కొద్ది రోజుల క్రితమే విడిపోయారు. పెళ్లి ఫోటోలపై అమలాపాల్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరింత సందేహంగా మారింది అని చెప్పారు.

    పాత షోటోషూట్ ఫోటోలనే..

    పాత షోటోషూట్ ఫోటోలనే..

    ఇటీవల మీడియాలో వెలుగు చూసిన ఫోటోలు గతంలోని ఫోటోషూట్‌కు సంబంధించినవి. మాకు తెలిసినంత వరకు కొద్ది రోజుల క్రితమే అమలాపాల్, భవిందర్ సింగ్ విడిపోయారు. వారిద్దరూ తమ అఫైర్‌కు బ్రేకప్ చెప్పారు. వారిద్దరు పెళ్లి చేసుకోనే అవకాశం లేదు. నిజంగా పెళ్లి జరిగితే దాచాల్సిన అవసరం వారికి లేదు. ఈ విషయంపై మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

    Recommended Video

    Amala Paul Marriage With Mumbai Based Singer Bhavninder Singh
    బ్రేకప్‌ను భరించలేకే..

    బ్రేకప్‌ను భరించలేకే..

    అమలాపాల్‌లో భవిందర్ సింగ్ బ్రేకప్ జరిగిందనే విషయంపై మాకు స్పష్టమైన సమాచారం ఉంది. ఆ బ్రేకప్‌ను భరించలేకే భవిందర్ గత ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి డిలీట్ చేసి ఉంటారనుకొంటున్నాం. ఇప్పుడు వారిద్దరూ ఎవరికీ అందుబాటులో లేరు కనుక.. అమలాపాల్ స్పందిస్తే తప్ప పెళ్లి వార్తలపై క్లారిటీ రాదని భావిస్తున్నాం అని సన్నిహితులు చెప్పారు.

    English summary
    Actress Amala Paul marriage with Singer Bhavninder Singh happend on March 20th. This marriage Photos went viral in Social media. But insiders told media that.. Amala, Bhavinder Breakup happens recenlty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X