అజ్ఞాతంలో అమలాపాల్.. వివాదంగా సీక్రెట్ పెళ్లి.. ఆమె ఎక్కడున్నదంటే..
దక్షిణాది తార అమలాపాల్ సీక్రెట్ పెళ్లి అంశం అత్యంత వివాదంగా మారుతున్నది. రహస్యంగా పెళ్లి చేసుకొన్నారంటూ మీడియాలో వస్తున్న ఫోటోలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా తన పెళ్లిపై అమలాపాల్ స్పందించకుండా మౌనం దాల్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా సన్నిహితులు చెప్పిన ప్రకారం అమలాపాల్ అజ్ఞాతంలో వెళ్లారని.. ఆమె బయటకు వస్తే గానీ అసలు విషయం బయటపడదనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇంతకు అమలాపాల్ ఎక్కడికి వెళ్లిందంటే..

పెళ్లి జరుగలేదని సన్నిహితులు
అమలాపాల్ పెళ్లి చేసుకోలేదు. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు రావడం నిజమే. భవిందర్ సింగ్‌తో విభేదాలు రావడంతో వారిద్దరు విడిపోయారు. తాజాగా భవిందర్ సింగ్ చేసిన ఫొటోలు గతంలో తీసినవి. ప్రస్తుతం పెళ్లి జరగలేదని అమలపాల్ సన్నిహితులు బలంగా చెబుతున్నారు. అమలాపాల్ త్వరలోనే బయటకు వచ్చి అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తుందని అన్నారు.

బ్రేకప్ తర్వాత హిమాలయాలకు
భవిందర్ సింగ్‌తో విభేదాల తర్వాత అమలాపాల్ మనస్తాపానికి గురయ్యారు. బ్రేకప్ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రస్తుతం ఆమె హిమాలయాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మనసు ప్రశాంత కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఆమె అజ్ఞాతం నుంచి బయటకు వస్తారు. స్వయంగా అమలాపాల్ తన పెళ్లిపై వివరణ ఇస్తారు అని సన్నిహితులు ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భవిందర్‌ను ఫాలో కావడం లేదు
భవిందర్ సింగ్‌కు సంబంధించిన ఏ సోషల్ మీడియా అకౌంట్‌ను అమలాపాల్ ఫాలో కావడం లేదు. కాబట్టి ఆయన లీక్ చేసిన విషయం ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. హిమాలయాల నుంచి తిరిగి వస్తే తప్ప ఆమెకు ఈ విషయం తెలిసే అవకాశం లేదు. కాబట్టి అంత వరకు వేచి ఉండాల్సిందే అని అమలాపాల్ సన్నిహితులు చెప్పారు.
Recommended Video

అమలా పాల్ పెళ్లి జరుగలేదు
నాకు తెలిసి అమలాపాల్ పెళ్లి చేసుకొనే అవకాశమే లేదు. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోదు. కాబట్టి భవిందర్ లీక్ చేసిన ఫొటోలలో వాస్తవం లేదు. త్వరలోనే సీక్రెట్ మ్యారేజ్‌పై వాస్తవాలు బయటకు వస్తాయి. అంతవరకు అందరూ వేచి ఉండాల్సిందే అని అమలాపాల్ సన్నిహితులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











