యువ నటిపై మాజీ ప్రియుడు దాడి.. దారుణంగా హింసిస్తూ నరకం.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
తమిళ, మలయాళ రంగాల్లో అందం, అభినయంతో రాణిస్తున్న యువ హీరోయిన్ అనికా విక్రమన్‌పై మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రకంపనలు రేపాయి. తనపై మాజీ ప్రియుడు దాడి చేసిన తర్వాత తీవ్రమైన గాయాలతో ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. తనను దారుణంగా గాయపరిచాడని తీవ్ర గాయాలతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మానసికంగా, శారీరకంగా
సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసిన అనికా విక్రమన్.. నేను కొద్దికాలం అనూప్ పిళ్లై అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. కొద్ది సంవత్సరాలుగా నన్ను మానసికంగా, శారీరకంగా దాడి చేస్తున్నారు. నా జీవితంలో అలాంటి దుష్టుడిని చూడలేదు. నన్ను అనేక రకాలుగా బెదిరించారు. అతడిని తలచుకొంటేనే పీడకల వస్తుంది. నాపై రెండోసారి శారీరకంగా దాడి చేయడంతో బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను అని అనికా విక్రమన్ తెలిపారు.

కాళ్లు పట్టుకొంటే క్షమించి వదిలేశా
నన్ను తొలిసారి చెన్నైలో శారీరకంగా దాడి చేశాడు. ఆ తర్వాత తప్పైందని కాళ్లు పట్టుకొంటే క్షమించి వదిలేశాను. అయితే రెండోసారి కూడా అలాగే దాడి చేశారు. అయితే నేను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టించుకోలేదు. అతడు పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. పోలీసులు కూడా పట్టించుకోకుండా వారిని ప్రభావితం చేశారు. ఈ వివాదం గురించి మరిచిపోమ్మని పోలీసులు తెలిపారు అని అనికా విక్రమన్ తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో తెలిపింది.

నా ఫోన్ పగలకొట్టాడు అంటూ
నా మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై నన్ను చాలా రకాలుగా మోసగించాడు. అతడిని వదిలేద్దామని అనుకొన్నాను. కానీ నన్ను అతడు వదలకుండా వేధిస్తున్నాడు. అతడు నా స్నేహితుడనే ఒక్క కారణంతో నేను భరిస్తున్నాను. అతడు నా ఫోన్ పగలకొట్టాడు. దాంతో నేను షూటింగ్‌కు కూడా వెళ్లలేదు. నా ఫోన్ పగలకొట్టడానికి ముందు నా వాట్సాప్ మెసేజ్‌లు చూశాడు. నా ల్యాప్ టాప్‌లోని నా వ్యక్తిగత విషయాలను నాకు తెలియకుండా చూశాడు అని అనికా విక్రమన్ తెలిపింది.

పలు విధాలుగా నాపై దాడులు
గత కొద్ది సంవత్సరాలుగా అనేక విధాలుగా వేధిస్తున్నప్పటికీ.. పలు విధాలుగా నాపై దాడులకు పాల్పడినప్పటికీ నేను భరించాను. నన్ను చంపుతానని పలుమార్లు బెదిరించారు. నా ఫ్యామిలీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించాడు. నాపై చేసిన దాడి నుంచి కోలుకొని షూటింగులకు హాజరవుతున్నాను. ఇక ముందు నా జీవితం ప్రశాంతంగా ఉంటుందని అనుకొంటున్నాను అని అనికా విక్రమన్ చెప్పింది.

పోలీసులకు చిక్కకుండా
నా మాజీ లవర్‌పై ఫిర్యాదు చేశాను. కానీ అనూప్ పిళ్లై న్యూయార్క్‌లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు అతడి గురించి సోదాలు జరుపుతున్నారు. నా ప్రియుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొంటారని భావిస్తున్నాను అని అనికా విక్రమన్ చెప్పారు.
అనికా విక్రమన్ కెరీర్ ఇలా
అనికా విక్రమన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల K అనే చిత్రంలో కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం ఇంగా పట్టాన్ పత్రియా, విశమ కరణ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటించేందుకు అంగీకరించింది. త్వరలోనే వాటి వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











