అంతకుమించి?.., కుండ బద్దలు కొట్టిన అంజలి, 'జై'తో ప్రేమాయణంపై తేల్చేసింది..
అబ్బాయి నెమ్మదస్తుడు.. అమ్మాయికి దూకుడెక్కువ.. ఇద్దరి మధ్య ప్రేమ పుడితే.. ఆ కెమిస్ట్రీయే వేరబ్బా!. జర్నీ సినిమాలో అంజలి-జై మధ్య లవ్ ట్రాక్ ఈ కెమిస్ట్రీని అద్భుతంగా పండించింది.
Recommended Video

వీరిద్దరి పేర్లు వినగానే ఇప్పటికీ టక్కున గుర్తొచ్చే సినిమా జర్నీయే అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆన్ స్క్రీన్ పై మాయ చేశారిద్దరు. అలాంటి వీరిద్దరు.. రీల్ లైఫే కాదు, రియల్ లైఫ్ లోను ప్రేమలో మునిగితేలుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అంజలి-జై హీరో హీరోయిన్లుగా నటించిన బెలూన్ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో.. జైతో ప్రేమాయణంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంజలి చెప్పిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

అంతకుమించి?..
బెలూన్ చిత్ర విశేషాల గురించి మాట్లాడుతున్న సమయంలో.. జైతో ప్రేమాయణం గురించి ప్రస్తావించగా అంజలి దానిపై స్పందించారు. జై తనకున్న మంచి స్నేహితుల్లో ఒక్కరు అంతే అంటూ తేల్చి పారేశారు. అంతకు మించి మా మధ్య ఇంకేమి లేదని స్పష్టం చేశారు.

'దోసె' వ్యవహారంతో:
అప్పట్లో 'దోసె' వ్యవహారంతో అంజలి-జై ప్రేమాయణం బట్టబయలైందని మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. ప్రియమైన వ్యక్తులు మనకోసం వండిపెడితే ఎంత రుచిగా ఉంటుందో.. అంటూ అంజలి చేసిన ట్వీట్ కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే దోసె వేయడానికి ప్రియుడే అయి ఉండాలా? అంటూ అంతలోనే పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది అంజలి.

పెళ్లెప్పుడు?.. ప్రేమాయణం ఎంతదాకా?
జర్నీ సినిమా నుంచే అంజలి-జై మధ్య స్నేహం కొనసాగుతోంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అది ప్రేమగా మారిందన్న ప్రచారం జరిగింది. వీరిద్దరు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా.. పెళ్లెప్పుడు?.. ప్రేమాయణం ఎంతదాకా వచ్చింది? వంటి ప్రశ్నలు కామన్ అయిపోయాయి.
మీడియా ఎంతలా కూపీ లాగుదామని చూసినా.. వీరు మాత్రం విషయాన్ని కప్పి పుచ్చుతూనే ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంజలి మాత్రం అలాంటిదేమి లేదన్నట్లుగానే సమాధానం చెబుతున్నారు. తన మనసులో ఇప్పటికీ ఎవరూ లేరంటూ తాజా ఇంటర్వ్యూలోను అంజలి అదే విషయాన్ని స్పష్టం చేశారు.
అంజలి-జై 'బెలూన్':
హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమాకథ చిత్రం 'బెలూన్'. సుమారు ఐదేళ్ల తర్వాత జైతో కలిసి అంజలి నటించిన చిత్రం కావడంతో.. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరోసారి వీరిద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీ రిపీట్ అవుతుందేమో చూడాలి. అదే జరిగితే వీరిద్దరి ఖాతాలో మరో హిట్ పడ్డట్టే.

బెలూన్ 29న రిలీజ్
ఇంతకుముందు నటించిన జర్నీ(ఎంగేయుమ్ ఎప్పోదుమ్) సినిమాకు పూర్తి భిన్నమైన పాత్రలో అంజలి బెలూన్ చిత్రంలో కనిపిస్తారట. తమిళంలో తెరకెక్కిన బెలూన్ ఈ నెల 29న విడుదలకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications










