ఆ హీరోయిన్ చనిపోయింది అంటూ వదంతులు.. అసలు విషయం ఇదే!
మలయాళీ, తమిళ నటి అంజు మరణించింది అంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చివరకు అంజు స్వయంగా స్పందించడంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.. అంతా ఊపిరి పీల్చుకున్నారు కూడా. అంజుకు స్నేహితుడు, సినిమా టోగ్రాఫర్ అయిన నటరాజ్ సుబ్రహ్మణ్యం అంజు మరణించినట్లు వస్తున్న వార్తలపై స్పందించాడు. ఈ వదంతులు సృష్టించిన వారిపై ఆయన మండిపడ్డారు.

మరణించినట్లు పుకార్లు
తమిళ మలయాళీ మీడియాలో అంజు మరణించినట్లు పుకార్లు వ్యాపించాయి. కొంత సమయం తరువాత ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. తన కుటుంబంతో తాను సంతోషంగా ఉన్నానని అంజు స్పందించింది. తాను మరణించినట్లు వచ్చిన వార్తలు తనని, తన కుటుంబ సభ్యులని ఎంతగానో బాధించాయని 41 ఏళ్ల అంజు పేర్కొంది.

వాళ్లకు ఏం లాభం
అంజు స్నేహితుడు అయిన సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యం ఈ వార్తలపై మండిపడ్డారు. అంజు ఇకలేరు అంటూ కొందరు అసత్య ప్రచారం చేశారు. ఆమె వలసరవాక్కంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంది. అసలు ఇలాంటి పుకార్లు ఎందుకు సృష్టిస్తారు.. మీకు ఏంటి ఉపయోగం అంటూ నటరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా
అంజు చిన్ననాటి నుంచే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పలు చిత్రాల్లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బేబీ అంజుగా గుర్తింపు పొందింది. ఇప్పటికి అంజుని ఆమె సన్నిహితులు బేబీ అంజు అని పిలుస్తుంటారు. ఆ తరువాత టివి నటిగా, హీరోయిన్ గా తమిళ మలయాళీ భాషల్లో నటించింది. సినిమారంగంలో, టివి రంగంలో అన్ని రకాల పాత్రలతో మెప్పించింది.

ఎలాంటి కారణం లేకుండా
కనీసం బలమైన కారణం కూడా లేకుండా అంజు మరణించింది అంటూ వదంతులు సృష్టించారు. అంజు టైగర్ ప్రభాకర్ ని వివాహం చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఆ తరువాత నటుడు సుందర్ ని రెండవ వివాహం చేసుకుంది. 1979లోనే అంజు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగ ప్రవేశం చేసింది.


Click it and Unblock the Notifications











