సెక్సీ నటి సోదరుడిని అరెస్టు చేసిన పోలీసులు
సెక్సీనటిగా పేరు పొందిన బాబిలోనా సోదరుడు విక్కీ (27) పీకలదాకా తాగి, వీధిలో వీరంగం వేయడంతో నగర చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అతన్ని రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక విక్కీ పై వడపళని, విరుగంబాక్కం పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే నాలుగు కేసులున్నాయి. అతను అప్పుడప్పుడూ మద్యం సేవించి తాను నివసించే ప్రాంతంలో అల్లరి చేయడమే కాకుండా, ఒక వృద్ధుడిపై దాడిచేసినట్లు అతనిపై కేసులు ఉన్నాయి. దీనిపై ఏసీపీ మనోహర్ విచారణకు ఆదేశించగా, అతడిపై ఆరోపణలు నిజమేనని వెల్లడైంది. తాజాగా మరో సందర్భంలోనూ ఇలాగే రభస చేస్తుండగా, ఇన్‌స్పెక్టర్ జయకుమార్ రెడ్ హ్యాడ్ గా పట్టుకున్నారు.
చెన్నై మనోహర్ జయకుమార్ టిఎన్ రాజేంద్ర బాబిలోనా విక్కీ babilona jayakumar tn rajendra sexy star drinking


Click it and Unblock the Notifications