For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అప్పుడు వ్యభిచారం కేసు..ఇప్పుడు ఛీటింగ్ కేసు

  By Srikanya
  |

  హైదరాబాద్ : అప్పట్లో(2009) వ్యభిచారం కేసులో పట్టుబడి అరెస్టు అయిన భువనేశ్వరి మరోసారి జైలు ఊచలు లెక్కిస్తోంది. ఆమె తాజాగా ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కుంది. చెన్నైకు చెందిన గురు నాధన్ అనే ఫిలిం ఫైనాన్సియర్ తనను ఎనభై ఐదు లక్షలుకు మోసం చేసిందంటూ కేసు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...ఆమె రీసెంట్ గా Konjam Kobam Konjam Sirippu అనే తమిళ చిత్రం చేసింది. ఆ చిత్రం నిర్మాణం నిమిత్తం ఆ మొత్తం ఆమె లోన్ తీసుకుందని ఆమె మీద కేసు పెట్టారు. భువనేశ్వరి తల్లి సంపూర్ణం ఆ మొత్తం తీసుకున్నారని ఆ కేసులో ఉంది. దాంతో తల్లి కూతుళ్లు ఇద్దరిపై కేసు నమోదైంది.

  ఆ లోన్ ఎమౌంట్ తీర్చమంటే చెక్ ఇచ్చారని,అది బౌన్స్ అయ్యిందని కంప్లైంట్ లో రాసారు. దాంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసారు. ఇక భువనేశ్వరి మొదట టీవి సీరియల్స్ నుండి 'బాయ్స్" చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత 'కుర్ కురే" చిత్రంలో దువ్వాసి మోహన్ తో జతకట్టింది. ఈ భారీ అందాల భామ భువనేశ్వరి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబెట్టింది. సినీమాలో తన కెరీర్ అంతబాగా రానీయక పోవడంతో ప్రొడ్యూసర్ గా మారబోతున్నాని చెప్పింది. ఆల్ రెడీ ఆమె రెండు టీవి సీరియల్స్ కి నిర్మాణ సారద్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

  ఇక ఆ మధ్య ఆమె ఫిలిం చాంబర్ లో తను కొత్తగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తన మొదటి చిత్రంగా 'పెళ్లామా పెళ్లాడదామా" అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించుకుందని సమాచారం. ఈ చిత్రం లో హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, డైరక్టర్, ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలో తెలియజేస్తానంటోంది భువనేశ్వరి. ఈ లోగా ఈ కేసులో ఇరుక్కుంది. వ్యభిచారం కేసులో అరెస్టు అయనా ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆపర్స్ వస్తూనే ఉన్నాయి.

  అలాగే గతంలో కూడా ఆమె వ్యభిచారం కేసులు అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే మరో సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడటంతో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై సిటీ ఏంటీ ప్రాసిట్యూషన్ వింగ్ తమకు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రైడ్ చేసారు. అలాగే ఈ బ్రోతల్ నెట్ వర్క్ లో మరికొందరు సినిమావాళ్ళు ఉన్నారని ఆమె ప్రకటించి సంచలనం రేపింది.

  English summary
  Actress Bhuvaneswari, who played the female lead in Konjam Kobam Konjam Sirippu, has landed in jail with a film financier Gurunathan filing a complaint against her and her mother Sampoornam Ammal for cheating him to the tune of 85.50 lakhs. In his complaint, Gurunathan alleged that he had loaned the amount as Sampoornam wanted to produce the film Konjam Kobam Konjam Sirippu and her daughter Bhuvaneswari played the heroine in it. When he tried to encash the cheque they had given to him for realising the loan amount, it bounced following which he filed a police complaint.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X