‘ఆ నటుడితో గానీ.. ఆయనతో సహజీవనం చేయడం లేదు. ఆ విడాకులకు కారణం నేను కాదు’
తమిళ సినీ రంగంలో నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ విడాకులు, హీరోయిన్‌తో డేటింగ్ అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలచాయి. గత కొద్ది రోజులుగా జీవీ ప్రకాశ్ తన భార్య నుంచి విడాకులు కోరుకొంటున్న విషయం తెలిసిందే. అయితే భార్యతో విడాకులకు కారణం ఓ యువ హీరోయిన్‌తో ఉన్న వివాహేతర సంబంధమే అనే విషయం తమిళ మీడియాలో నానుతున్నది. అయితే తనకు జీవీ ప్రకాశ్‌తో ఉన్న రిలేషన్ గురించి ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెల్చేసింది. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత జీవీ ప్రకాశ్ కుమార్ తన భార్య, సింగర్ సైంధవితో విడాకులు తీసుకొన్నారనే విషయం అందరికి తెలిసిందే. వారిద్దరు కలిసి ఒకే కారులో కోర్టుకు వెళ్లి విడాకులకు సంబంధించిన పత్రాలను దాఖలు చేయడం.. ఆ తర్వాత ఒకే కారులో తిరిగి వెళ్లడం మీడియాను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంత అన్యోన్యంగా ఉన్న వారిద్దరి విడిపోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే గాయని సైంధవి కాపురం విచ్చిన్నం కావడానికి కారణం జీవీ ప్రకాశ్‌తో యువ హీరోయిన్ దివ్య భారతికి ఉన్న సంబంధమే అనే వార్తలు గుప్పుమంటున్నాయి. వారిద్దరు కలిసి బ్యాచ్‌లర్, కింగ్‌స్టన్ సినిమాలో కలిసి నటించడంతో ఆ రూమర్లకు మరింత బలంగా మారాయి. అయితే దివ్య భారతితో తనకు ఉన్నది ప్రొఫెషనల్ రిలేషన్, ఆమెతో నాకు ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్ అని జీవీ ప్రకాశ్ వెల్లడించారు.
జీవీ ప్రకాశ్ పలుమార్లు వెల్లడించిన తర్వాత కూడా తమకు వివాహేతర సంబంధం ఉందనే వార్తలను తాజాగా హీరోయిన్ దివ్య భారతీ కొట్టిపడేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ నోట్ పెట్టి.. ఒకరి ఫ్యామిలీ మ్యాటర్‌లోకి నా పేరు లాగడం ఎంత మాత్రం సరికాదు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. జీవీ ప్రకాశ్ కుమార్ ఫ్యామిలీ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ యాక్టర్‌తో గానీ, లేదా వివాహితుడితో డేటింగ్ చేశాననే వార్తల్లో నిజం లేదని చెప్పడం కొంత ఘాటుగానే అనిపిస్తుంది అని దివ్య భారతీ తన పోస్టులో పేర్కొన్నారు.
జీవీ ప్రకాశ్‌తో నాకు లింక్ పెడుతూ చాలా వార్తలు వచ్చాయి. కానీ నేను ఓపిక పడుతూ చాలా సైలెంట్‌గా ఉన్నాను. అవాస్తవ కథనాలు నా జీవితానికి ఏ మాత్రం భంగం కలిగించవు. కానీ ఆ కథనాలు హద్దు మీరుతున్నాయని భావించినప్పుడు స్పందించకపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేలా మారుతున్నది అని ఆమె తన పోస్టులో వెల్లడించారు.
నేను మానసికంగా బలంగా ఉంటాను. నేను స్వతంత్రంగా వ్యవహరించే మహిళను. ఇలాంటి గాసిప్స్‌కు భయపడను. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారికి ఒకటే రిక్వెస్ట్. నెగిటివిటీని స్ప్రెడ్ చేయకుండా సమాజ హితానికి పనికి వచ్చే వార్తలు రాయండి. నా జీవితానికి ఉండే హద్దులను బ్రేక్ చేయకండి. నా పరిమితులను గౌరవించండి. ఇలాంటి వార్తలకు ఇదే మొదటి, చివరి స్పందన అంటూ దివ్య భారతి రాసిన లేఖలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











