సినిమాటోగ్రాఫర్‌తో యువ హీరోయిన్ పెళ్లి.. ప్రేమ కథ సుఖాంతం కావడంతో..
తమిళ హీరోయిన్ గాయత్రి కృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కున్నది. తన కాలేజీ సహ విద్యార్థి, సినిమాటోగ్రాఫర్‌ను వివాహం చేసుకోనున్నారు. గాయత్రి పెళ్లి వార్త తమిళ మీడియాలో చర్చనీయాంశమైంది. కెరీర్ ఆరంభంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంపై రకరకాల కామెంట్లు వినిపించాయి. తమిళంలో మేర్కు థోడ్రాచి మలై, జోకర్ చిత్రాలతో ప్రేక్షకులకు గాయత్రి దగ్గరయ్యారు. వివారాల్లోకి వెళితే.

మొదటి చిత్రంతోనే జాతీయ అవార్డు
తమిళ చిత్ర పరిశ్రమలో గాయత్రి కృష్ణ అత్యంత ప్రతిభావంతురాలు. తన మొదటి చిత్రం జోకర్‌తోనే జాతీయ అవార్డును గెలుచుకొన్నారు. గురు సోమసుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇసాయి అనే పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత సినిమాలు లేకపోవడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా పుంజుకొంటున్నారు.

సినిమాటోగ్రాఫర్‌తో అఫైర్
గత కొద్దికాలంగా తన కాలేజీ సహ విద్యార్థి, సినిమాటోగ్రాఫర్ జీవన్ రాజ్‌తో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారు. వీరి ప్రేమను పెద్దలకు చేరవేసి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చర్యలు తీసుకొన్నారు. దాంతో వీరి పెళ్లికి అడ్డంకులు తొలిగాయి. వీరి పెళ్లికి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి.

మే 19న వివాహం.. 22న విందు
గాయత్రి కృష్ణ, జీవన్ రాజ్ పెళ్లి మే 19న గురువాయుర్‌లో జరుగుతుంది. కేరళకు చెందిన కుటుంబం కావడంతో అక్కడి సంప్రదాయాల ప్రకారం గాయత్రి పెళ్లిని జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పెళ్లి అనంతరం మే 22న త్రివేండ్రమ్‌లో వివాహ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమిళ, మలయాళ సినీ, రాజకీయ వర్గాలను ఆహ్వానించినట్టు సమాచారం.

చివరిసారిగా ఆ చిత్రంలో
గాయత్రి కృష్ణ కెరీర్ విషయానికి వస్తే, ఆమె చివరి సారిగా మేర్కు తోడార్చి మలై చిత్రంలో కనిపించారు. ఈ సినిమాకు లెనిన్ భారతి దర్శకత్వం వహించారు. వలస కూలీల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విలన్‌కు భార్యగా గాయత్రి నటించి మెప్పించింది.


Click it and Unblock the Notifications











