twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాస్పిటల్ కోసం జ్యోతిక 25 లక్షల విరాళం.. దూషించిన వారే ప్రశంసలతో..

    |

    తమిళ సూపర్ స్టార్ సూర్య ఫ్యామిలీ విరాళాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు. పేదల కోసం, సమస్యల్లో ఉన్న వారిని ఆదుకోవడం, సామాజిక సమస్యలపై స్పందించిన దాఖలాలు ఉన్నాయి. తాజా సూర్య సతీమణి, నటి జ్యోతిక తంజావూర్ ప్రభుత్వ హస్పిటల్‌ కోసం 25 లక్షల రూపాయలను విరాళం ప్రకటించారు. సూర్య నిర్వహించే అగరామ్ ఫౌండేషన్ తరఫున విరాళాన్ని అందజేశారు.

    హాస్పిటల్ అభివృద్ది పనులకు వినియోగించాలని అధికారులను కోరారు. హాస్పిటల్‌కు అవసరమైన సాంకేతిక పరికరాలు, బెడ్స్‌ను అధికారులు సమకూర్చడంతోపాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పెయింటింగ్ పనులును పూర్తిచేశారు. పిల్లల కోసం పార్క్‌ను అందంగా తీర్చిదిద్దారు. హస్పిటల్ అభివృద్ది కోసం జ్యోతిక విరాళం ప్రకటించిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం, హాస్పిటల్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపించారు.

    Actress Jyothika Rs25 lakh donation for Tanjore government hospital

    ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం తంజావూరు వెళ్లిన జ్యోతిక ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆ ఆలయంలో పరిశుభ్రత గురించి కొనియాడారు. అక్కడే ఉన్న హాస్పిటల్‌లో వసతులు చూసి ఆమె.. ఇలాంటి ఉండే ఆరోగ్యం ఎలా బాగుపడుతుందని వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఆ హాస్పిటల్ బాగు కోసం 25 లక్షల విరాళం ప్రకటించడం విశేషంగా మారింది. జ్యోతిక విరాళం విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

    English summary
    Actress Jyothika donates 25 lakhs for Government Hospital. Officials procured medical equipments, beds for the hospital. Apart from this Children park in hospital also renovated. Now, Jyothika donation news is trending in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X