ఇండస్ట్రీలో చాలా లైఫ్ చూశా.. సైలెంట్‌గా ఉండలేను.. నయనతార, కుష్బూను లాగిన కస్తూరి శంకర్

సీనియర్ నటి కస్తూరి శంకర్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అనవసరమైన వివాదాల్లో మీరు తలదూర్చడం దేనికి అనే ప్రశ్న ఎదురు కాగా, దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. మరి యాంకర్ షాకింగ్ ప్రశ్నకు ఈ ఫైర్ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం పదండి.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మీరు అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీలలో ఇన్వాల్వ్ అవుతారు అని టాక్ ఉంది. ఎందుకలా అనే ప్రశ్న ఎదురుగా, కస్తూరి ఎలాంటి కాంట్రవర్సీ అని తిరిగి ప్రశ్నించింది. అంటే మీకు అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వివాదాల గురించి కూడా ట్వీట్లు చేస్తూ ఉంటారని బయట చాలామంది అంటూ ఉంటారు అని యాంకర్ అన్నాడు.

Actress Kasthuri Shankar drags Nayanatara and Kushbu and gives epic reply on Trolls and controversies

దానికి కస్తూరి మాట్లాడుతూ అవును, తప్పేముంది? నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఒపీనియన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి సోషల్ కాన్షియస్ అనేది ఉండాలి. 16 ఏళ్ల వయసులో మనకు పెద్దగా లోకజ్ఞానం ఉండదు. కానీ ఇప్పటికే నేను 25 ఏళ్ల సినిమా ఇండస్ట్రీని, పర్సనల్, సోషల్ లైఫ్ ను చూశాను. నన్ను తమిళనాడులో నటి కస్తూరి అని పిలిచిన వాళ్ళు చాలా తక్కువ. సోషల్ యాక్టివిస్ట్ కస్తూరి, సామాజిక కార్యకర్త కస్తూరి అని పిలిచిన వాళ్లే ఎక్కువ అని క్లారిటీ ఇచ్చింది ఈ సీనియర్ నటి.

ముందుగా అందరూ నువ్వు ఒక నటివి మాత్రమే, డాన్సులు వేసుకుని అంతవరకే ఉండు అని విమర్శించేవారని, కానీ ఇప్పుడు ఏదైనా ఇష్యూపై మాట్లాడకపోతే డైరెక్ట్ గా నువ్వు ఎందుకు ఆ ఇష్యూ మీద మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నారని వెల్లడించింది కస్తూరి. ఖష్బూ, నయనతార వంటి నటిమనులను ఉదహరిస్తూ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చింది కస్తూరి.

ఇప్పుడు ఖుష్బూ డైరెక్ట్ గా బీజేపీ పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు. మాట్లాడేవాళ్లు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. నాదేం పెద్ద విషయం కాదు. కానీ వాళ్ల గురించి ఎలా మాట్లాడతారో మీకు తెలుసు. అయినప్పటికీ ఖుష్బూ తన దారిలో తాను పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఆమె కష్టాన్ని బీజేపీ వాళ్లు రికగ్నైజ్ చేసి ఉమెన్స్ రైట్స్ కమిషన్ ను ఆమెకు అప్పగించారని గుర్తు చేసింది.

Actress Kasthuri Shankar drags Nayanatara and Kushbu and gives epic reply on Trolls and controversies

కాబట్టి మాట్లాడే వాళ్ళు ఏదైనా మాట్లాడుతారని, వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది కస్తూరి. అలాగే నయనతార గురించి తాను లాయర్ గా లీగల్ పాయింట్ చెప్తే ఇక్కడ వాళ్ళు దాన్ని న్యూస్ గా చేస్తారని, తెలుగులో ఎథిక్స్ లేని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా ఉన్నారు కదా... వాళ్ళకి కాంట్రవర్సీ కావాలి. నేనేం చెప్పినా చెప్పకపోయినా కాంట్రవర్సి చేస్తారు అంటూ ఫైర్ అయ్యింది .

అలాంటి వాళ్లకు భయపడి నేను నోరు మూసుకొని ఉండలేను. ఒకవేళ మీకు అది కంటెంట్ కింద అనిపిస్తే తీసుకోండి అంతే అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది కస్తూరి. అయితే ఆమె సమాధానం చెప్పిన క్రమంలో నయన్ ను మధ్యలోకి లాగడం, తెలుగు యూట్యూబ్ ఛానల్స్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ఏదైతేనేం సోషల్ కాన్షియస్ అనేది కచ్చితంగా ఉండాలని, తప్పని తెలిస్తే ఊరుకోవద్దని ఈ సందర్భంగా వెల్లడించింది కస్తూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X