తమిళులకు తెలుగోళ్లు సేవకులు .. కోలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ .. చంద్రబాబు , పవన్‌లను లాగుతూ

దాదాపు 70 ఏళ్ల క్రితం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగువారు ఒక భాగం. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం కావడంతో శ్రీకాకుళం నుంచి తంజావూరు వరకు తెలుగువాళ్లు విస్తరించారు. అన్ని రంగాల్లో తమిళుల ఆధిపత్యం, వారి చేతుల్లో తెలుగు వారికి జరుగుతున్న అవమానాలను అమరజీవి పొట్టి శ్రీరాములు తట్టుకోలేకపోయారు. మద్రాస్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతాలను విభజించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ఆత్మ బలిదానంతో నాటి జవహర్ లాల్ నెహ్రూ దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే నేటికీ కొందరు తమిళులకు తెలుగు వాళంటే చులకన. వీలు కుదిరినప్పుడల్లా తెలుగువాళ్లని అవమానించడానికి చూస్తుంటారు. తాజాగా కోలీవుడ్ సీనియర్ నటి కస్తూరి శంకర్ తెలుగువారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి సబ్జెక్ట్‌పై అయినా ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడేవారిలో కస్తూరి ముందు వరుసలో ఉంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాలకు ఈవిడ పెట్టింది పేరు. అప్పుడెప్పుడో 1991లో ఆతా ఉన్ కోయిలే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, సొగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు, అన్నమయ్య, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో, డాన్ శీను, శమంతకమణి, సింబా వంటి సినిమాలతో తెలుగువారిని సైతం ఆకట్టుకున్నారు.

Actress kasthuri shankar gives clarity on her comments on telugu people

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రవికుమార్ అనే వ్యక్తిని పెళ్లాడారు కస్తూరి. వివాహం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చేందుకు గాను కొన్నాళ్లు ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్న ఆమె తిరిగి సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు. అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలు వేస్తూ బిజీ అయ్యారు. బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సీరియల్స్, షోలు చేశారు. కొద్దిరోజుల క్రితం స్టార్ మాలో ప్రసారమైన ఇంటింటి గృహలక్ష్మీ ధారావాహిక ద్వారా తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువైన ఆమె తన నటనతో ఆ సీరియల్‌ని టాప్‌లో నిలబెట్టారు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌ ఉండే కస్తూరి తన సినిమాలు , వ్యక్తిగత వివరాలతో పాటు సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 300 ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంత: పుర మహిళలకి సేవ చేయడానికి తెలుగువారు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. వారంతా శతాబ్ధాలుగా స్థిరపడిన బ్రాహ్మణులేనని, తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలోని తెలుగు మూలాలున్న మంత్రులను టార్గెట్ చేసేలా ఆమె వ్యాఖ్యానించారు.

అయితే ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కస్తూరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె స్వయంగా ఎక్స్ ద్వారా స్పందించారు. తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలుసుకోకుండా కొందరు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. తెలుగు ప్రజలు నాపై ప్రేమను, అభిమానాన్ని చూపుతున్నారు. కానీ నేను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించి.. నాపై వ్యతిరేకత తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోందని కస్తూరి మండిపడ్డారు. ఈ యాంటీ హిందువులు.. ప్రస్తుతం సనాతన ధర్మాన్ని పాటిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, రేవంత్ రెడ్డిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. డీఎంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలుగు మీడియాకు కస్తూరి శంకర్ విజ్ఞప్తి చేశారు. మరి ఆమె వివరణపై నెటిజన్లు, డీఎంకే వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: kasthuri shankar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X