నన్ను కాపాడింది ఆయనే.. ఎంతో మంది హీరోయిన్స్‌తో కలసి.. నటి ఖుష్బూ!

Recommended Video

#MeToo : Actress Khushboo Supports Arjun Sarja

సీనియర్ హీరో అర్జున్ పై వచ్చిన మీటూ ఆరోపణలు దక్షణాది చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కన్నడ నటి శృతి హరిహరన్ అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పెద్ద దుమ్మరంగా మారుతోంది. అర్జున్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అర్జున్ అలాంటి వారు కాదని సపోర్ట్ చేస్తున్నారు. అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న వారి జాబితాలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా చేరింది.

వీపున చేయి వేసి

వీపున చేయి వేసి

ఇటీవల కన్నడ నటి శృతి హరిహరన్ అర్జున్ పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దర్శకుడు ఆదేశించకుండానే తన వీపుపై అర్జున్ చేయి వేసి రుద్దాడని శృతి హరిహరన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. చిన్మయి, శృతి హరిహరన్ వంటి సెలెబ్రిటీల ఆరోపణలతో దక్షిణాదిలో కూడా మీటూ సంచలనంగా మారుతోంది.

 క్షమాపణలు చెప్పాలని డిమాండ్

క్షమాపణలు చెప్పాలని డిమాండ్

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ అర్జున్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఖుష్బూ, అర్జున్ కలసి పలు చిత్రాల్లో నటించారు.

నన్ను కాపాడింది ఆయనే

నన్ను కాపాడింది ఆయనే

నాకు అర్జున్ 35 ఏళ్ల నుంచి తెలుసు. ఏనాడూ ఆయన తప్పుగా ప్రవర్తించలేదు. ప్రస్తుతం ఆయనపై వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని ఖుష్బూ తెలిపింది. షూటింగ్ లో చాలా సందర్భాల్లో జనాలు మీద పడుతుంటే ఆయనే నన్ను కాపాడారు అని ఖుష్బూ అర్జున్ వ్యక్తిత్వం గురించి వివరించింది.

ఎంతోమంది హీరోయిన్స్

ఎంతోమంది హీరోయిన్స్

అర్జున్ 20 ఏళ్లుగా ఎంతోమంది హీరోయిన్లతో కలసి నటించారు. ఏ ఒక్కరు కూడా అర్జున్ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు ఆయనపై వస్తున్న అసత్య ఆరోపణలతో ఓ చెడు అభిప్రాయానికి రావద్దు అంటూ ఖుష్బూ వివరించింది. అర్జున్ మంచి వ్యక్తి అంటూ ఆయనపై వస్తున్న లైంగిక ఆరోపణలని ఖుష్బూ కొట్టిపారేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X