twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ సర్కార్‌పై ఖుష్బూ వరుస ట్వీట్లు.. గూండాయిజాన్ని పెంచుతున్నారు!

    |

    దళపతి విజయ్ నటించిన చిత్రాలు వివాదాల్లో చిక్కుకోటం కొత్త కాదు. మెర్సల్ బిజెపి బారిన పడి చిక్కులు ఎదుర్కొంది. ఇప్పుడు సర్కార్ చిత్రం అన్న డీఎంకే సర్కార్ చేతిలో సమస్యలు ఎదుర్కొంటోంది. మొత్తంగా అధికార పార్టీ పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తల వత్తిడి తాళలేక సర్కార్ చిత్ర యూనిట్ వివాదస్పద సన్నివేశాల తొలగింపుకు అంగీకారం తెలిపారు. కొన్ని సన్నివేశాలు మ్యూట్ చేయనున్నారు. కానీ అన్నా డీఎంకే పార్టీకి సినీ ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

     గళం విప్పిన రజని, కమల్

    గళం విప్పిన రజని, కమల్

    సర్కార్ చిత్ర వివాదంపై కమల్ హాసన్, రజనీకాంత్ స్పందించిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన చిత్రాన్ని ఎలా అడ్డుకుంటారు అంటూ రజనీకాంత్ నిలదీశారు. వేధించడం ఈ పార్టీకి కొత్త కాదు అంటూ కమల్ హాసన్ సెటర్లు వేశారు. రజని, కమల్ తో పాటు తమిళ సినీ ప్రముఖులు ఒక్కొకరుగా సర్కార్ చిత్రానికి మద్దత్తు తెలుపుతున్నారు.

    విరుచుకుపడ్డ ఖుష్బూ

    విరుచుకుపడ్డ ఖుష్బూ

    తాజాగా ఆలాంటి అందాల హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అయిన ఖుష్బూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. విజయ్, మురుగదాస్ సర్కార్ చిత్రానికి ఆమె సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు. ఒక దర్శకుడి ఆలోచనలని, సెన్సార్ సభ్యుల అనుమతి పొందిన చిత్రాన్ని అడ్డుకునే అధికారం వేళ్ళకు ఎవడు ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ పోస్ట్ చేసింది.

    భయంతోనే ఇలా

    ఒక చిత్రంపై ప్రభుత్వం ఇంత హింసాత్మకంగా స్పందిస్తుందంటే అందుకు అందుకు కారణం వారిలో దాగున్న భయమే అని ఖుష్బూ అన్నారు. రాజకీయాలు, అధికారం రెండూ ఇలాంటి పనులకు దుర్వినియోగం చేయబడుతున్నాయి. విజయ్ గత చిత్రాలకు కూడా ఇలాంటి పరిస్థితి చూశాం అని ఖుష్బూ తెలిపారు.

    అన్నీ వాళ్లే నిర్ణయిస్తారా

    ఒక చిత్రంలో ఎలాంటి డైలాగ్స్ ఉండాలి, ఎలాంటి సన్నివేశాలు ఉండాలో కూడా రాజకీయ పార్టీలు, అల్లరి మూకలు నిర్ణయిస్తే ఇక సెన్సార్ బోర్డు ఎందుకు.. దానిని నిర్వీర్యం చేయండి అంటూ ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    గూండాయిజం పెంచుతున్నారు

    సన్నివేశాలు, డైలాగులు తొలగించడం వలన చిత్ర పరిశ్రమకు సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు. అన్నాడీఎంకే పార్టీ గూండాయిజాన్ని పెంచి పోషిస్తోంది అని ఖుష్బూ విరుచుకుపడ్డారు. హీరో విశాల్ కూడా సర్కార్ చిత్రానికి మద్దత్తుగా నిలిచిన సంగతి తెలిసిందే.

    English summary
    Actress Khushbu responds on Sarkar movie controversy. Khushbu made sensational comments on AIADMK
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X