కుష్బూ‌కు అకతాయిల ఝలక్.. మరో చేదు అనుభవం

యాక్టర్, పొలిటిషియన్ కుష్భూ సుందర్‌కు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలింది. తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేయడంతో ఆమె షాక్ గురయ్యారు. సోమవారం ఈ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్ ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకొన్నారు. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని వెల్లడించారు. అలాగే తన అభిమానులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తనకు ఎవరైనా సహాయం చేయగలరా అని రిక్వెస్ట్ చేశారు. గత 48 గంటల్లో నా పాస్‌వర్డ్ మార్చుకోలేకపోయాను అని చెప్పారు.

ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అంటూ

ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అంటూ

నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో అనుమానం వస్తున్నది. లేక నేను మూడుసార్లు తప్పుడు పాస్‌వర్డ్ టైప్ చేయడం ద్వారా ఏదైనా టెక్నికల్ లోపం తలెత్తిందా అని కుష్బూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది. గత రెండు రోజులుగా నా పాస్‌వర్డ్‌ను మార్చుకోలేకపోతున్నాను అని కుష్భూ చెప్పింది.

ఎవరైనా హెల్ప్ చేయండి

ఎవరైనా హెల్ప్ చేయండి

నాకు ట్విట్టర్ కూడా హెల్ప్ చేయడం లేదు. నా అకౌంట్‌ సస్పెండ్ అయిందా అనే అనుమానం కలుగుతున్నది. ఇలాంటి విషయాలను నన్ను కంగారు పెడుతున్నాయి. ఎవరికైనా ఈ విషయంపై అవగాహన ఉంటే చెప్పండి. నాకు సరైన హెల్ప్ చేయండి అంటూ కుష్బూ తన ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా కోరింది.

అకతాయిలు ఝలక్

అకతాయిలు ఝలక్

అయితే కుష్భూ అకౌంట్‌లో ఎవరూ కూడా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్టు చేయకపోవడంతో కాస్త ఆమె ఉపశమనం చెందుతున్నారు. అకతాయిలు ఈ పనికి పూనుకొన్నారా? లేక పాస్‌వర్డ్‌లో లోపం కారణంగా ఇలాంటిదేమైనా జరిగిందా అనేది ఆసక్తికరంగా మారింది. కుష్బూకు ట్విట్టర్‌లో దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

గతంలో కూడా ఇలాంటిదే

గతంలో కూడా ఇలాంటిదే

కుష్బూ గతేడాది తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. ట్విట్టర్‌లో తనను ఎక్కువగా ట్రోల్ చేయడంతో మనస్తాపం చెందిన ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అనవసరపు టెన్షన్లను తప్పించుకోవడానికి తాను సోషల్ మీడియా నుంచి వైదొలగాలని అనుకొంటున్నాను అని అన్నారు. కానీ సన్నిహితుల సలహా మేరకు తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకొన్నారు.

Recommended Video

Raashi Khanna Speech At Worlds Famous Lover Event
రజనీకాంత్‌తో కలిసి..

రజనీకాంత్‌తో కలిసి..

తమిళ తెరపై కుష్బూ మళ్లీ కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్వకుడు సిరుతై శివా డైరెక్టర్. రజనీకి భార్య నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగులో పవన్ కల్యాణ్‌తో కలిసి ఇటీవల అజాతవాసి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X