For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లేవాలి, తినాలి, 'అలా' కనిపించాలి అంటూ రెచ్చగొడుతున్న వసూల్ రాణి… స్లిమ్ గా మారి మరీ చంపేస్తోంది!

  |

  కిరణ్ రాథోడ్... అంటే వెంటనే గుర్తు రాకపోవచ్చు కానీ తెలుగులో వసూల్ రాణి అంటే కొందరికి గుర్తురావచ్చు. 2008లో ఆమె వసూల్ అనే సినిమా తమిళ్ లో చేయగా దానిని వసూల్ రాణి పేరిట రిలీజ్ చేశారు. ఆ సినిమా ఆమెకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఆ తరువాత కూడా ఆమె కొన్ని సినిమాల్లో కాస్త హాట్ తరహా పాత్రలు పోషించింది. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ విషయంలోకి వెళితే

  'సిద్దు' తో మొదలెట్టి

  'సిద్దు' తో మొదలెట్టి

  'సిద్దు' అనే సినిమాతో 2001 లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ జైపూర్ భామ 'నువ్వు లేక నేను లేను', 'శుభకార్యం', 'అందరూ దొంగలే దొరికితే' లాంటి సినిమాల్లో నటించింది. అలాగే చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అయితే కిరణ్ చివరిగా తెలుగులో నటించిన సినిమా 'కెవ్వు కేక'. అయితే తెలుగులో ఇప్పుడు సినిమాలు చేయకున్నా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూనే ఉంది. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటిస్తూ అక్కడే సెటిల్ అయింది ఈ భామ.

  సినిమాలు లేకున్నా హాట్ ఫొటోలతో

  సినిమాలు లేకున్నా హాట్ ఫొటోలతో

  నిజానికి ఈ భామకు హాట్ ఇమేజ్ ఎక్కువే. అందుకే 2016 నుంచి ఎలాంటి ఆఫర్లు లేకపోయినా హాటు హాటుగా ఫోటో షూట్లు చేస్తూ అవకాశాల కోసం ఘాటు ఘాటు ప్రయత్నాలు చేస్తోంది. 40 ఏళ్ళ వయసులో కూడా చక్కగా కసరత్తులు చేస్తూ పర్ఫెక్ట్ షేప్ మెయింటెయిన్ చేస్తూ ఉండడంతో హాట్ నెస్ కూడా గట్టిగానే మెయింటైన్ చేస్తూ ఉంటోంది. మరి ఈ హాట్ నెస్ ను ఎవరైనా గుర్తించి ఆఫర్లు ఇస్తారని అనుకుంటే ఓకే ఒక్క సినిమా ఆఫర్ వచ్చింది.

  సోషల్ మీడియాలో యమా యాక్టివ్

  సోషల్ మీడియాలో యమా యాక్టివ్

  అయితే సినిమా ఆఫర్లు లేకపోయినా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో యాక్టివ్‌గా ఉన్న కిరణ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. అందుకే ఎప్పటికప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన, హాట్ ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా కుర్రకారును తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

  చక్కనమ్మ చిక్కిపోయి

  చక్కనమ్మ చిక్కిపోయి

  నిజానికి ఈమెకు చాలా రోజుల నుండి సరైన సినిమా అవకాశాలు లేవు. దీంతో గత కొన్నేళ్లుగా బరువు పెరగడంతో బాధపడుతున్న కిరణ్, లాక్‌డౌన్ ముగిసే సమయానికి బరువు తగ్గుతానని చాలెంజ్ చేసింది. ఆమె చాలెంజ్ చేసినట్టుగానే ఇప్పుడు స్లిమ్ గా తయారయి మరీ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

  లేవడం, తినడం, సెక్సీగా కనిపించడం


  అంతే కాక లేవడం, తినడం, సెక్సీగా కనిపించడం, మళ్ళీ అదే రిపీట్ చేయడమే 'లాక్డౌన్ మంత్రం' అనే క్యాప్షన్ కూడా పెట్టడం విశేషం. ఇక ఈ జైపూర్ భామకు ఒక బాలీవుడ్ కనెక్షన్ ఉంది. అదేంటంటే? పాతికేళ్ల క్రితం టాప్ హీరోయిన్ ఇప్పటి మాజీ హీరోయిన్ అయిన రవీనా టాండన్ కు ఈ కిరణ్ రాథోడ్ కజిన్ అవుతుందట. మొత్తం మీద ఈ ముదురు భామ లేటు వయసులో బరువు తగ్గి కుర్రకారుకు సవాలువిసురుతోంది కదూ!

  English summary
  Actress Kiran Rathod had made her debut in Telugu cinema with the movie siddhu and in tamil cinema with Gemini directed by Saran and co-starring Vikram, and the movie turned out to be a massive blockbuster and a great start to the actress' career. Kiran Rathod went on to act alongside top heroes like Ajith, Vijay, Vishal, Kamal Haasan and many others in movies like Villain, Thirumalai, Thimiru, Anbe Sivam and many more movies in Tamil, Telugu and Malayalam. Recently she shared her slim photo in her instagram which gone viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X