మా ఆయనకు అస్సలు రొమాన్స్ తెలియదు... సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సీనియర్ నటి కుష్బూ సుందర్ తాజాగా తన భర్తకు రొమాన్స్ తెలియదు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె అసలు ఎందుకు అందరి ముందు ఇలాంటి కామెంట్స్ చేసింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
సీనియర్ నటి కుష్బూ సుందర్ సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు తమిళ భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కుష్బూ నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ కు ఎంపికైన ఆమె మహిళల గురించి ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తూ ఉంటుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బ్యూటీ తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

బాక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన భర్తకు అస్సలు రొమాన్స్ తెలీదు అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 35 ఏళ్లకు పైగా తమిళ చిత్ర సినిమాలో హీరోయిన్ గా కొనసాగిన కుష్బూ సినిమాలో బిజీగా ఉన్న టైం లోనే ప్రముఖ డైరెక్టర్ సుందర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల మధ్య గొడవల గురించి ప్రస్తావన రాగా... చాలామంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ నెల రోజులు కాకముందే ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తనకు అర్థం కాలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
పదేళ్లపాటు డేటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా పెళ్లయి ఏడాది కాకముందే మాకు ఇద్దరికీ సెట్ అవ్వట్లేదు అనే సాకులు చెప్తున్నారని, ముఖ్యంగా ఇటీవల కాలంలో పెళ్లయిన కొత్త జంటలు ఇలాంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన విషయంలో ఇన్నేళ్లు ఎలా కలిసి ఉన్నారు అని ప్రశ్నిస్తారని, అయితే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకు పోతే జీవితాంతం హ్యాపీగా కలిసి ఉండొచ్చని ఈ సందర్భంగా వైవాహిక బంధం లో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆమె సలహా ఇచ్చింది.

అంతేగాని కొట్టుకోవడం వంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, భార్యాభర్తలు లేదా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగానే తనను ఉదాహరణగా చూపిస్తూ తన భర్తకు అస్సలు రొమాన్స్ తల్లిదనే వివరించింది. తన భర్త సుందర్ దృష్టిలో రొమాన్స్ అంటే ఇంట్లో ఉండడం, కావలసింది వండుకోవడం, ఫ్యామిలీతో కలిసి సరదాగా ఉండడం తినడం అని వివరించింది.
అంతేగాని ఆయన ఏనాడు తనను క్యాండిల్ లైట్ డిన్నర్ వంటి వాటికీ తీసుకెళ్లలేదని, ఎలాంటి రొమాంటిక్ ప్లాన్లో వేయలేదని, అయినప్పటికీ తమ ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నామని వివరించింది. సుందర్ సీ రూపొందించిన బాక్ అలియాస్ అరణ్మని 4 మూవీ మే 3వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో తమన్నా, రాశీ ఖాన్నా గ్లామర్ పంట పడించడంతో పాటు వారు నటించిన స్పెషల్ సాంగ్ వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











