Kushboo: ఆస్పత్రిలో సెలైన్ బాటిల్‌తో నటి కుష్బూ.. నిర్లక్ష్యం చేయకండి అంటూ బాధగా!
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి కుష్బూ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆమె బాల నటిగా సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఇక ఫ్యామీలీ హీరో, విక్టరీ వెంకటేష్‌తో జోడీ కట్టి తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. 1986లో విడుదలైన ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తర్వాతి కాలంలో మంచి నటిగా, హీరోయిన్ గా వెలుగొందారు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, బుల్లితెర షోలపై అట్రాక్ట్ చేస్తున్న కుష్బూ తాజాగా ఆస్పత్రి పాలయ్యారు. దీంతో కుష్బూకు ఏమైందా అని ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్పెషల్ ఇమేజ్: మొదట్లో విక్టరీ వెంకటేష్‌తో జోడీ కట్టిన కుష్బూ కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన కుష్బూ చిరంజీవి, నాగార్జున వంటి తదితర స్టార్ హీరోలతో ఆడిపాడారు. తెలుగులోను ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వరుస సిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2, రామ బాణం చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ విధానాలపై: ఇక కోలీవుడ్‌లో కుష్బూకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమెను ఎంతగా ఆరాధించేవారంటే దానికి ఉదాహరణ ఏకంగా ఆమెకు గుడి కట్టడమే. దీంతో తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్గా కుష్బూ రికార్డు సాధించారు. సినిమాల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసి ఓడిపోయిన కుష్బూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక అంశాలపై, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటారు.
15 ఏళ్లు వచ్చేసరికి: ఓవైపు రాజకీయాలు, అప్పడప్పుడు బుల్లితెర, వెండితెరపై కనువిందు చేస్తున్న కుష్బూ ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇటీవలే తన తండ్రి 8వ ఏట తనపై లైంగిక దాడి చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాక్ కు గురి చేశారు. 15 ఏళ్లు వచ్చేసరికి అలాగే జరిగేదని, అమ్మ కూడా ఏం చేయలేకపోయిందని తన ఆవెదనను అందులో తెలిపారు.

సైలైన్ బాటిల్ తో: ఇప్పుడు తాజాగా ఆస్పత్రిలో బెడ్ పై కనిపించి మరో షాక్ ఇచ్చారు సీనియర్ నటి కుష్బూ. ఆమె అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ రూపంలో చెప్పుకొచ్చారు. ఆస్పత్రి బెడ్ పై సెలైన్ బాటిల్ తో బెడ్ పై పడుకుని ఉన్న ఫొటోను షేర్ చేసిన సీనియర్ హీరోయిన్ కుష్బూ తన ఆరోగ్య పరిస్తితిని వివరించారు. తనకు ఫ్లూ సోకినట్లు, అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
వైరస్ సోకినట్లుగా: "జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఇలా అన్ని ఓకేసారి అటాక్ చేశాయి. నాకు అతి చెడ్డ అడినో వైరస్ సోకింది. అందుకే చాలా కష్టంగా, బలహీనంగా అనిపిస్తోంది. ఎవరికైనా ఈ వైరస్ సోకినట్లుగా, ఎలాంటి లక్షణాలు కనిపించిన నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యంగా ఉండండి" అని పోస్టులో బాధగా రాసుకొచ్చారు కుష్బూ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications











