పట్టపగలే తమిళ హీరోయిన్‌పై తుపాకి కాల్పులు.. ముంబై డాన్‌ హస్తం?

తమిళ హీరోయిన్ లీనా మారియా పాల్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం కేరళ, తమిళనాడులో సంచలనం రేపింది. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు నోరు మెదపకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే...

వివాదాస్పద హీరోయిన్‌గా

వివాదాస్పద హీరోయిన్‌గా

వివాదాస్పద హీరోయిన్‌గా పేరుపడిన లీనా మారియా తమిళ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. బాలీవుడ్ హీరో, నిర్మాత జాన్ అబ్రహం తెరకెక్కించిన మద్రాస్ కేఫె చిత్రంలో కీలక పాత్రను పోషించింది. ఇంకా మలయాళంలో హస్బండ్స్ ఇన్ గోవా, రెడ్ చిల్లీస్ అనే చిత్రాల్లో హీరోయిన్ పాత్రలను పోషించింది. తమిళంలో చివరిసారిగా బిర్యాని అనే సినిమాలో కనిపించింది.

కెనరా బ్యాంకుకు 19 కోట్ల టోకరా

కెనరా బ్యాంకుకు 19 కోట్ల టోకరా

గతంలో చెన్నైలోని కెనరా బ్యాంకుకు టోకరా వేసినట్టు ఆరోపణలతోపాటు కేసు కూడా నమోదైంది. తన వ్యాపార భాగస్వామి సుఖేష్ చంద్రశేఖర్‌తో కలిసి రూ.19 కోట్లు కుచ్చుటోపి పెట్టింది. అలా ఆ కేసుతో వివాదాస్పద నటిగా మారింది.

కోచి బ్యూటీ పార్లర్‌పై కాల్పులు

కోచి బ్యూటీ పార్లర్‌పై కాల్పులు

వివాదాల్లో మునిగి తేలుతున్న నటి లీనా మారియా పాల్‌ ప్రస్తుతం కేరళలో ఉంటుంది. కోచిలోని పనమ్‌పిల్లిలోని బ్యూటి పార్లర్‌లో ఉండగా అగంతకులు కాల్పులు జరిపారు. నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ముంబై డాన్ రవి పుజారా హస్తం

ముంబై డాన్ రవి పుజారా హస్తం

లీనా మారియా పాల్‌‌పై కాల్పుల ఘటన శనివారం మధ్యాహ్నం జరిగినట్టు మీడియా ధృవీకరించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో రవి పూజారా అనే పేరు ఉన్న చీటిని వదిలిపెట్టడం అనేక అనుమానాలకు దారి తీసింది.

 పిస్టల్‌, పేపర్‌ను వదిలేసి

పిస్టల్‌, పేపర్‌ను వదిలేసి

లీనా మారియా పాల్‌‌పై దాడికి పాల్పడినది ముంబై నేర సామ్రాజ్యంలోని రవి పూజారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంత సేపు బ్యూటీ పార్లర్ వద్ద వేచి చూసిన ఇద్దరు ఎయిర్ పిస్టల్‌తో కాల్పులు జరిపారు. ఆ తర్వాత పిస్టల్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. వెళ్తూ ఓ పేపర్ ముక్కను వదిలి పోయారు అని ప్రత్యక్ష సాక్షి వెల్లడించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X