రజనీకాంత్ వల్లే ఛాన్సులు పోయాయి.. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న రజనీ కాంత్ పై తనతో ఇదివరకు హీరోయిన్ గా నటించిన సీనియర్ బ్యూటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

టాలెంట్ చూసి..

టాలెంట్ చూసి..

రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్.. బెంగళూరులో స్థిరపడిన ఒక మరాఠా కుటుంబంలో 1950 డిసెంబర్ 12న జన్మించారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌పై ఉన్న రజనీ కాంత్ బస్ కండక్టర్ ఉద్యోగం తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ లో చేరారు. అందులో రజినీకాంత్‌కు టాలెంట్‌కు అక్కడి వాళ్లు ముగ్ధులయ్యారు. ఆ సమయంలోనే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్ ఆయనలోని నైపుణ్యాన్ని చూసి 'అపూర్వ రాగంగళ్' అనే సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు.

బీస్ట్ డైరెక్టర్ తో..

బీస్ట్ డైరెక్టర్ తో..


అపూర్వ రాగంగళ్ మూవీతో నటనలోకి అడుగుపెట్టిన రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. రజనీ కాంత్ చివరిగా పెద్దన్న సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. తర్వాత ఆరోగ్య కారణాల దృష్ట్యా కొంతకాలం గ్యాప్ తీసుకున్నా ఆయన ప్రస్తుతం జైలర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బీస్ట్ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

మూవీపై కామెంట్స్..

మూవీపై కామెంట్స్..

తలైవా రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ సినిమా ఈ ఏడాది తమిళ సంవత్సరాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే రజనీ చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రమే కాకుండా డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. అందులో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ గా నిలిచిన చిత్రం బాబా ఒకటి. ఈ సినిమాలో రజనీకి హీరోయిన్ గా నటించిన మనీషా కోయిరాలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబా మూవీపై కామెంట్స్ చేసింది.

స్కూల్ డేస్ నుంచి..

స్కూల్ డేస్ నుంచి..

నేపాలీ బ్యూటి మనీషా కోయిరాలా అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ బొంబాయి, భారతీయుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తన కెరీర్ లో మంచి నటనకు గానూ 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్సుతోపాటు నేపాల్ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కరాన్ని 2001లో దక్కించుకుంది. స్కూల్ డేస్ నుంచే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ 1991లో సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

బన్నీ మూవీ రీమేక్ లో..

బన్నీ మూవీ రీమేక్ లో..


1942- ఏ లవ్ స్టోరీ, బాంబే (బొంబాయి), అగ్ని సాక్షి, ఇండియన్ (భారతీయుడు), గుప్త్-ది హిడెన్ ట్రూత్, కచ్చే ధాగే, కంపెనీ, ఏక్ చోటీసి లవ్ స్టోరీ వంటి సినిమాలు మనీషా కోయిరాలకు నటిగా మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఆమె అల వైకుంఠపురములో మూవీ హిందీ రీమేక్ అయిన షెహజాదా సినిమాలో నటించింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న హీరామండి చిత్రంలో నటిస్తోంది.

సౌత్ కెరీర్ క్లోజ్..

సౌత్ కెరీర్ క్లోజ్..

ఇక రజనీకాంత్ తో మనీషా కోయిరాల 2002లో చేసిన బాబా సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "బాబా.. బహుశా అదే నా చివరి పెద్ద తమిళ చిత్రం. ఆరోజుల్లో ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే భారీ డిజాస్టర్. సినిమాపై చాలా అంచనాలు ఉండేవి.. అది ఫ్లాప్ అయితే నాకు సౌత్ కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరిగింది. బాబాలో నటించడానికి ముందు నా చేతుల్లో సౌత్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అవకాశాలు ఆగిపోయాయి" అని మనీషా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X