మీనా కోరిక రహస్యంగా..

అలాగే చాలా కాలంనుంచీ మీనా,ఆమె తల్లి పెళ్ళి కొడుకు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే వారికి నచ్చే వాడు ఇప్పటి వరకూ తారసపడలేదుట. ఇక ఆమె కు భర్త అయ్యే వాడు ఎలా ఉండాలనేది తల్లీ,కూతుళ్ళు స్పెసిఫిక్ గా చెప్పారు. ఆ వివరాలు అప్పట్లో మంచి సంచలనం సృష్టించాచాయి...అవి ...వరుడు చెన్నైలో సెటిల్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మీనా ఆమె తల్లి తండ్రులకు ఒక్కత్తే కూతరు కాబట్టిట. వారికి దగ్గరిగా ఉండాలని కోరుకుంటోంది కాబట్టి.
ఇక ఆమె వయిస్సు 30 సంవత్సరాలు (పుట్టిన తేది September 16, 1978).కాబట్టి వరుడు ఓ మూడేళ్ళు అయినా పెద్దవాడయి ఉండాలి. సినిమా వాళ్ళ మీద పెద్ద ఆసక్తి లేదుట. బిజెనెస్ గానీ సాఫ్ట్ వేర్ వాళ్ళయితే మేలుట. ఇక ఆమెను ఆమెగా ప్రేమించేవాడు అయ్యుండాలిట. అంతేగానీ డబ్బు,కీర్తి అవి చూసి ఇష్టపడి ఆశపడేవాడు అయ్యుండకూడదంటోంది. ఇలా...ఇంకా చాలా ఉన్నాయట. ముందు అతని స్మైల్ నచ్చాలంటోంది.
సింపుల్ సిటీ ముఖ్యమని చెప్పింది...అలాగే ప్రస్తుతం ఆమె మళ్ళీ బిజీ అవుతోంది కాబట్టి కెరీర్ కి అడ్డుపడకూడదట. ఇంకా...చాలా..ఉన్నాయి. ఇక ఇంతకు ముందే ఆమె కన్నడ నటుడు సుదీప్ ని వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. ఏదైమైనా ఎన్నోసార్లు వాయిదా పడుతున్న మీనా తన కోరిక ఇన్నాళ్ళుకి తీర్చుకోబోతోంది.


Click it and Unblock the Notifications











