ఇస్లాం మతం స్వీకరించిన హీరోయిన్, బురఖాలో ఇలా! (ఫోటో)
హైదరాబాద్: సౌత్ నటి మోనికా ఇస్లాం మతం స్వీకరించారు. మే 30, 2014న ఆ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆమె ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ దుస్తులు బురఖా ధరించిన ఫోటోల్లో దర్శనమిచ్చారు. మోనికా ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల్లో నటించారు. తమిళం, తెలుగు, మళయాలం చిత్రాల్లో ఆమె నటించారు.
ప్రపంచంలో అత్యధికులు అనుసరిస్తున్న మతం ఇస్లాం. అయితే మోనికా ఎందుకు నిర్ణయం తీసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. మతం మార్చుకోవడంతో పాటు తన పేరునుకూడా మార్చుకున్నారు మోనిక. తన పేరును ఇపుడు ఎంజి రహీమాగా మార్చుకున్నారు.

తమిళంలో మంచి గుర్తింపు ఉన్న మోనికా బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా ఆమె అవార్డు అందుకున్నారు. మళయాల చిత్ర సీమలో పరవన అనే స్ర్కీన్ నేమ్‌తో పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











