గుడి మెట్లపై చిరంజీవి హీరోయిన్ భిక్షాటన.. కొంగుపట్టుకుని దీనంగా ..
చిత్ర పరిశ్రమలో నటీనటుల జీవితాలు ఎప్పుడు? ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేం. కోట్ల రూపాయలు వెనకేసి, అత్యంత విలాసవంతంగా బతికిన వాళ్లు చివరి రోజుల్లో పూటగడవటమే కష్టంగా జీవితాన్ని ముగించారు. చిత్తూరు నాగయ్య, సావిత్రి, కాంతారావు, రాజనాల సహా ఎందరో నటీనటులు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి తర్వాత చితికిపోయారు. కొందరైతే భిక్షాటన చేసుకుని బతికినవారు ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ గుడిమెట్లపై భిక్షాటన చేస్తూ కనిపించడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ నటి ఎవరు? ఆమె ఎందుకు భిక్షాటన చేయాల్సి వచ్చింది? ఈ వివరాల్లోకి వెళితే..
కెరీర్ ప్లానింగ్‌లో విఫలం
80వ దశకంలో తన నటన, అందం, డ్యాన్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించారు నటి నళిని. తమిళనాడుకు చెందిన నళిని 1981లో రజనీకాంత్ - చిరంజీవి నటించిన రాణువ వీరన్ అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. శోభన్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ సహా పలువురు అగ్రనటుల సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు. చిన్న వయసులోనే స్టార్ డమ్ రావడంతో దానిని ఎలా నిలబెట్టుకోవాలో నళినికి అర్ధం కాలేదు. అనుభవం లేకపోవడంతోపాటు ఔట్ డౌర్ షూటింగ్స్ అంటే భయం కారణంగా ఎన్నో విలువైన ప్రాజెక్ట్స్‌ను నళిని కోల్పోయారు.

రామరాజన్‌తో పెళ్లి, విడాకులు
1987లో తమిళ నటుడు రామరాజన్‌ను పెళ్లాడారు నళిని. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. అయితే అభిప్రాయ భేదాల కారణంగా 2000వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకుంది. అయితే విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పిన వెంటనే నళిని కోర్టు హాల్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చారట. పక్కనే ఉన్న రామరాజు ఆమెను ఓదార్చారట. విడిపోయినప్పటికీ తన మాజీ భర్తను నళిని ఎంతో ప్రేమిస్తూ అన్యోన్యంగా ఉంటారు. ఒంటరి తల్లిగా ఎన్నో ఇబ్బందులు పడ్డ నళిని.. తర్వాత సినిమాలలో విలన్‌గా నటించడంతో పాటు పలు సీరియల్స్ చేశారు. ఆమె పడిపోకుండా కాపాడింది సీరియల్సేనని నళిని పలుమార్లు తెలిపారు.
విడిపోతామని ముందే తెలుసు
తమ పెళ్లి రాహుకాలంలో జరిగినందువల్లే వివాహ బంధం నిలవలేదని నళిని ఎన్నోసార్లు చెప్పారు. తామిద్దరం ఖచ్చితంగా విడిపోతామని, జ్యోతిష్యుడు కూడా ఈ విషయంపై హెచ్చరించేవారని ఆమె వెల్లడించారు. అంతా ఊహించినట్లుగానే రామరాజన్- నళిని విడిపోవడం చిత్ర సీమను షాక్‌కు గురిచేసింది. విడాకుల తర్వాత పిల్లల్ని బాగా చదివించానని నళిని వెల్లడించారు. ప్రస్తుతం తమిళ సీరియల్స్‌లో అమ్మ, బామ్మ పాత్రలు పోషిస్తూ నళిని బిజీగా ఉన్నారు.
ఆలయం ముందు కొంగుపట్టి భిక్షాటన
కాగా.. తొలి నుంచి నళినిలో భక్తి, ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువ. పూజలు, వ్రతాలు, నోములు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాంటి నళిని ఈ శుక్రవారం చెన్నైలోని తిరువేర్కడులో ఉన్న దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట భిక్షాటన చేస్తూ కనిపించడంతో సినీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అయితే అమ్మవారు తనకు కలలో కనిపించి.. నా కోసం నువ్వు ఏం చేయగలవని అడిగిందని.. దాంతో ఏం చేయాలో తెలియక కొంగుపట్టి అడుక్కుంటున్నానని నళిని మీడియాకు తెలిపారు. భిక్షాటన సందర్భంగా వచ్చిన కానుకలను అమ్మవారికే సమర్పించానని చెప్పారు. సో.. అదన్న మాట మేటర్. ప్రస్తుతం నళిని గుడి ముందు భిక్షాటన చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











