twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్థరాత్రి కారులో భర్తతో నమిత.. పోలీసులతో వాగ్వాదం, బ్యాగ్ ముట్టుకోనివ్వలేదు!

    |

    దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల వేడి నెలకొని ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కోట్లకు కోట్లు కుమ్మరించి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి చర్యలని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తూ ఉంటుంది. త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో డబ్బు పంపిణి జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి పోలీసులు హీరోయిన్ నమిత, ఆమె భర్త వీరేంద్ర చౌదరి ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారట. అక్కడ పోలీసులకు, నమితకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించి నమిత భర్త వీరేంద్ర చౌదరి వివరణ ఇచ్చారు.

    పోలీసులతో దురుసుగా

    పోలీసులతో దురుసుగా

    ఈ ఘటన గురించి నమితకు వ్యతిరేకంగా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. నమిత పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటే వారితో నమిత అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిందని వార్తలు వచ్చాయి. నమితపై నెగిటివ్ ప్రచారం ఎక్కువవుతుండడంతో ఆమె భర్త వీరేంద్ర జరిగిన సంఘటనని వివరించారు.

    ఫైనల్‌గా షూటింగ్ కోసం

    ఫైనల్‌గా షూటింగ్ కోసం

    తాము షూటింగ్ కోసం కారులో ఏర్కాడ్ బయలుదేరాం. దాదాపు 8 గంటలుగా జర్నీ చేస్తుండడంతో నమిత కారులోని వెనుక సీట్ లో నిద్రపోతోంది. ఈ సంఘటన రాత్రి 2.30 గంటలకు జరిగింది. తాము కారులో బయలుదేరిన తర్వాత మూడుసార్లు వివిధ ప్రాంతాల్లో పోలీసులు తమ వాహనాన్ని తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్య రాలేదు. పోలీసు వారికి మేము సహకరించాం. వారు కూడా మాపట్ల మర్యాదగానే వ్యవహరించారు.

    ఎన్నికల సంఘం అధికారుల తనిఖీ

    ఎన్నికల సంఘం అధికారుల తనిఖీ

    ఆ తర్వాత సేలం, ఎర్కాడ్ జంక్షన్ కు చేరుకోగానే రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు తమ వాహనాన్ని ఆపారు. నాతో చాలా దురుసుగా మాట్లాడాడు. తన అధికారాన్ని మాపై చూపించాలని ప్రయత్నించాడు. తామేదో క్రిమినల్స్ అన్నట్లుగా ప్రవర్తించాడు. కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. నా భార్య అలసిపోయి నిద్రపోతోంది. అంతగా అవసరం అయితే నేను లేపుతాను. అని రిక్వస్ట్ చేశాను. అయినా వినిపించుకోకుండా డోర్ బలవంతగా తెరిచాడు. నిద్రపోతున్న నమిత కిందపడబోయింది.

     బ్యాగ్ ముట్టుకోనివ్వలేదు

    బ్యాగ్ ముట్టుకోనివ్వలేదు

    తామేదో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు కారు మొత్తం తనిఖీ చేయడానికి ప్రయత్నించాడు. నమిత వద్ద ఉన్న బ్యాగ్ కూడా తనిఖీ చేయాలని కోరాడు. అందుకు నమిత అంగీకరించలేదు. మీరు నా బ్యాగ్ చెక్ చేయాలని అనుకుంటే లేడి పోలీస్ చేత చెక్ చేయించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీకు మాత్రం నా బ్యాగ్ ఇవ్వను అని గట్టిగా చెప్పింది. ఎందుకంటే మహిళల బ్యాగుల్లో వారికి అవసరమైన వ్యక్తిగత వస్తువులు ఉంటాయి. పోలీసులు వాటిని తనిఖీ చేస్తున్నపుడు వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అదే లేడి పోలీస్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

    అది ఆమె హక్కు

    అది ఆమె హక్కు

    మహిళని చెక్ చేయాలంటే తప్పనిసరిగా మహిళా పోలీస్ ఉండాలి. అదే విషయాన్ని నమిత అడిగింది. అది ఆమె హక్కు. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదని వీరేంద్ర తెలిపారు. జరిగిన సంఘటనలో నమిత తప్పు లేదు. ఈ విషయాన్ని పెద్దది చేసి వార్తల్లో చూపించవద్దు అని వీరేంద్ర కోరారు.

    English summary
    Actress Namitha behave rudely with cops and EC officials
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X