తొలి అనుభవం ఇబ్బందే..నమిత

ఇక తండ్రి గారాల కూతరైన తాను ఎక్సపోజింగ్ రోల్స్ వేయటాన్ని ఫ్రొపిషనల్ లో ఓ బాగంగా భావిస్తోంది. మరి మీ నాన్న గారి ఎదురుగా చేయటాన్ని ఎంబ్రాసింగ్ గా ఫీలవటంలేదా అంటే తప్పదు...ఆయన అర్ధం చేసుకుంటాను అంది. ఆంధ్రాలో కూడా గుడి కట్టించుకోవాలనే కోరిక ఉందంటూ నమిత చెప్పుకొచ్చింది. భిల్లా సినిమాకోసం ఏడు కేజీలు తగ్గి డైలీ యోగ, సూర్య నమస్కారాలు చేస్తున్నానని, అందంగా ఉండి అభిమానులకు నచ్చటమే తన అంతిమ లక్ష్యమంటోంది. ఇక ఆమె చిన్నప్పుడు ఎప్పుడూ టీవీల్లో కనపడాలనే కోరిక ఉండేదిట. అందుకోసం ఆమె తన తండ్రిని సతాయిస్తూండేదని తన చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుని మురిసిపోయింది. భైరవి పేరు గల ఆమె గుజరాత్ సూరత్ కి చెందిన ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిందిన దాన్నని అందులోనూ 14 మంది ఉన్న జాయింట్ ఫ్యామిలీ కావటంతో కాస్తంత ఎమోషన్స్ అవీ ఎక్కువే నంది. ప్రస్తుతం ఆమె దేశద్రోహి చిత్రంలో చేస్తోంది. అలాగే ఆమె ప్రతిష్టాత్మకంగా బావించి చేస్తున్న జగన్మోహిని చిత్రం త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











