ప్రధాని మోదీ కోసం నమిత.. షాకింగ్‌గా ఏం చేశారో తెలుసా?
దక్షిణాది సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్న నమిత విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకలను ఆకట్టుకొన్నది. గత 15 ఏళ్లలో అందాల తారగా, శృంగారతారగా ఎన్నో పాత్రలతో ప్రేక్షకును మెప్పించింది. దక్షిణాదిలో అజిత్, విజయ్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో జతకట్టింది. ఇటీవల పెళ్లి చేసుకొన్న నమిత టెలివిజన్ రంగంవైపు అడుగులేస్తూనే రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా మోడీపై ఓపాటను రిలీజ్ చేసి వార్తల్లో కెక్కారు. మోదీపై, రాజకీయాలపై నమిత వెలడించిన అభిప్రాయలు ఏమిటంటే..

ప్రధాని మోదీ అభిమానిగా
ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న విధానాలు, పథకాలు చూసి ఆయనకు నమితా ఫ్యాన్‌గా మారిపోయారు. దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్న ప్రధాని మోదీపై పలుమార్లు బహిరంగంగానే ప్రశంసలు గుప్పించారు. గతే ఏడాది బిజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో చెన్నైలో కాషాయ జెండా తీర్థం పుచ్చుకొన్నారు. అప్పటి నుంచి బీజేపీ ప్రాంతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని మోదీపై వీడియో ఆల్బమ్
తాజాగా తెలుగు సినీ నిర్మాణ సంస్థ సరకాదమ్ స్టోరీస్ రూపొందించిన వీడియో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. ఈ వీడియో ఆల్బమ్‌కు ఎస్కే బాల చంద్రన్ సంగీతం వహించడమే కాకుండా పాటలు కూడా పాడారు. రామకృష్ణ సాహిత్యం అందించారు. భాను నాగ్ ఎడిటింగ్, యానిమేషన్‌ను అందించారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నమిత చేతుల మీదుగా ఆవిష్కరించడం విశేషంగా మారింది.

వీడియోను ఆవిష్కరించడం అదృష్టం
వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ తర్వాత నమిత మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన నేత, ప్రధాని నరేంద్రమోదీ గురించి తెలియజేసే వీడియో పాటలను ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రధాని విజన్, ఆలోచలనలను, సేవా దృక్పథాన్ని ప్రతిబింబిచే విధంగా ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించారు. పాటలు చాలా స్ఫూర్తి దాయకంగా ఉన్నాయి అని నమిత పేర్కొన్నారు.

దశాబ్దానికిపైగా కెరీర్‌లో
ఇక నమిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు సినిమాకు పరిచయమైన నమిత.. తమిళ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణించారు. దాదాపు దశాబ్దం కాలంపైగా సినిమాల్లో నటించారు. ఆమె కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో కలిపి మొత్తం 40కిపైగా సినిమాల్లో నటించారు. ఇటీవల చిత్తూరుకు చెందిన నివాసిని వివాహం చేసుకొని దాంపత్య జీవితంలో స్థిరపడ్డారు. అలాగే బుల్లితెరపైన పలు కార్యక్రమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











