నమిత పెళ్లి వీడియో వైరల్.. రొమాంటిక్‌గా ప్రపోజ్.. నన్ను అలా బుట్టలో పడేశాడంటూ కామెంట్
Recommended Video

దక్షిణాది అందాల తార నమిత వివాహం నటుడు, మోడల్ వీరేంద్ర చౌదరీతో ఇటీవల జరిగింది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొద్దిమందే హాజరైనప్పటికీ.. అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి వివాహం పలు సినీ రంగాలకు సంబంధించిన ప్రేక్షకులను, అభిమానులను ఆకర్షించింది. తాజాగా య్యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన నమిత పెళ్లి వీడియో యూట్యూబ్ వీడియో వైరల్‌గా మారింది.

తిరుపతిలో పెళ్లి
నమిత వివాహం హిందూ ముఖ్యంగా తెలుగు సంప్రదాయం ప్రకారం నవంబర్ 24న తిరుపతిలో వైభవంగా జరిగింది. నమిత జన్మత గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వారు. తొలుత తెలుగు, ఆ తర్వాత తమిళ చిత్ర సీమలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. సినీ పరిశ్రమలోనే కాక తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా మెరిసారు.

శశిధర్ బాబు
పెళ్లి అనంతరం నమిత విడుదల చేసిన ప్రకటనలో.. మాది ప్రేమతోపాటు పెద్దలు కుదిర్చిన పెళ్లి. నాకు వీరేంద్రను నా స్నేహితుడు శశిధర్ బాబు పరిచయం చేశాడు. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాం. తరచూ కలుసుకునే వాళ్లం.

రొమాంటిక్‌గా ప్రపోజ్
2017 సెప్టెంబర్ 6న బీచ్ రోడ్డులో చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అక్కడే నాకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేశాడు. నేను అసలు ఊహించలేదు అని నమిత వెల్లడించింది.

పరిచయం ప్రేమగా మారి
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నమితతో వీరేంద్రకు పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన ఓ ఏడాది తర్వాత నమితకు ఆయన పెళ్లి చేసుకొందామనే ప్రతిపాదన ముందుంచాడు. అప్పటికే వీరేంద్ర ప్రేమలో మునిగిపోయిన నమిత ఆ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సినీ ప్రముఖుల హాజరు
దాంతో నమిత, వీరేంద్ర తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వీరి పెళ్లికి రాధిక, శరత్‌కుమార్, గాయత్రి రఘురాం, శక్తి పీ వాసు, హారతి, గనేష్కర్ తదితరులు హాజరయ్యారు. వారంతా జీవితాంతం కలిసి ఉండాలని ఆశీర్వదించారు.
మ్యారేజ్ వీడియో వైరల్
ఇలా ప్రేమ వ్యవహారం మొదలుపెట్టి.. ఆ తర్వాత వారు పెళ్లి పీటల మీద ఏడడుగులు నడిచేందుకు కారణమైన ఓ వీడియోను ఇటీవల నమిత షేర్ చేశారు. ప్రస్తుతం నమిత పెళ్లి వీడియో విశేషంగా ఆకర్షిస్తున్నది.


Click it and Unblock the Notifications











