నయనతారకి బాగా ముదిరింది
నయనతార, ప్రభుదేవ మద్య జరగుతున్న ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడుతోందని సమాచారం. అప్పటకి ఆమె రోజుకొక సారైనా ఈ ప్రేమ ని ఖండిస్తోంది. ఐన ఏదో విధంగా ఈ గొడవ మళ్ళి మళ్ళి రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా ఈ మద్య జరిగిన ఓ సంఘటన వీరి ప్రేమ లో బలం రుజువు చేస్తోందంటున్నారు. మొన్నామధ్య ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం నయన స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని వచ్చింది. ఆ షూటింగ్ గ్యాప్‌లో నయన ఓ చెట్టు కింద సేద తీరుతుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమేరాల్లో బంధించడానికి ఎగబడ్డారు. వాళ్ల ఆత్రుత చూసిన నయన, సరేనన్నట్లు వివిధ ఫోజులను ఇచ్చిందట. అయితే ఓ ఫోజులో ఆమె ఎడమచేయి మోచేతి కిందవైపు "పి" అనే అక్షరం ఇంగ్లీషులోనూ, ఆ తర్వాత అక్షరాలేవో తమిళంలోనూ కనబడ్డాయి. ఈ స్టిల్ చూసిన టాలీవుడ్ సినీజనం "పి" అంటే ప్రభుదేవా అని వాదిస్తున్నారు. ఆమె కాదంటోంది. మరేమిటి అంటే పర్సనల్...ఐన అన్నీ చెప్పాలా అంటోంది. కోపం గా ఫోటోలు లేవు..ఏమి లేవు అని కసురుతోంది. ఇంతకి ఓ ప్రక్క నయన తార అమ్మ, నాన్న తమ కూతురు పై ఆంక్షలు పెడుతుంటే, మరో ప్రక్క ఇటువంటివి బయట పడి ఆమెను ఇబ్బందులలో పడేస్తున్నై. ఇక నయనతార వివి వినాయక దర్సకత్వంలో అదుర్స్ చిత్రంలో చేస్తుంది. రవితేజ సరసన ఆంజేనేయులు చిత్రంలోను చేస్తోంది.


Click it and Unblock the Notifications











