బాహుబలి వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార.. గ్రాండ్ గా ఓటీటీ ఎంట్రీ!

నెట్‌ఫ్లిక్స్ బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. గతంలో బాహుబలి వెబ్ సిరీస్ ను సగం షూటింగ్ అయిన తరువాత క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఎక్కువగా బుల్లితెర స్టార్స్ తోనే షూట్ చేశారు.

రాజమౌళి సలహా మేరకు నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులైన దేవకట్టా, ప్రవీణ్ సత్తారు వంటి వారిని సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. కానీ నెట్ ఫ్లిక్స్ కు ఆ సిరీస్ చాలా దారుణంగా ఉందని మధ్యలోనే ఆపేశారు. ఇక మరొక యువ దర్శకుడిని రంగంలోకి దింపి ప్రాజెక్ట్ ప్లాన్ ను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక క్యాస్టింగ్ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాహుబలి వెబ్ సీరీస్ కు నయనతార కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

Actress Nayanthara playing a important role in Baahubali web series

అయితే ఆమె ఏ పాత్రలో నటిస్తోంది అనే విషయంలో అయితే అసలైన ఇంకా క్లారిటీ రాలేదు. బాలీవుడ్ నటి వామికా గబ్బి ఈ వెబ్ సిరీస్‌లో దిగ్గజ శివగామి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరొక ముఖ్యమైన పాత్ర కోసం నయన్ తో సంప్రదింపులు జరుపగా ఆమె వెంటనే ఒప్పేసుకుందట. ఇక ఇంతవరకు నయన్ ఓటీటీ కంటెంట్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ప్రస్తుతం సమంత, కాజల్ , తమన్నా వంటి వారు ఆ రూట్లో వెళ్లి మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ లలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నయనతార ఓటీటీ ఆఫర్స్ ద్వారా గట్టిగానే అందుకుంటుందని చెప్పవచ్చు. మరి బాహుబలి లాంటి కాన్సెప్ట్ తో ఆమె ఎంట్రీకి ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X