ఇంటర్‌నెట్‌లో నా ఫొటోలుని ఆయన...రంభ
ఇంటర్‌నెట్‌లో నా ఫొటోలు తరచుగా చూస్తూ ఆయన మురిసిపోతుండేవారట. తన ఇష్టాన్ని నా దగ్గర వ్యక్తపరచకుండా మా అమ్మానాన్నను కలిసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పారు. మా ఇంట్లోవారికి ఆయన బాగా నచ్చారు. వెంటనే ఓకే చెప్పారు అంటోంది రంభ. వివాహానంతరం ఆమె మీడియాని కలిసి తమ పెళ్ళికి దారితీసిన పరిస్ధితులు వివరిస్తోంది. అలాగే మాది ప్రేమపెళ్లి కాదు. ఇరువర్గాల పెద్దలు ఎంతో ఇష్టపడి చేసిన పెళ్లి అని చెప్తోంది.
రంభ మాటల్లోనే... కెనడాకు చెందిన మేజిక్‌వుడ్స్ సంస్థ వారు బ్రాండ్ అంబాసిడర్‌గా చేయమన్నారు... చేశాను. ఆ సంస్థ అధినేతే ఇంద్రకుమార్. ఆయన నన్ను ఎప్పుడూ కలవలేదు. ఆ సంస్థ ప్రతినిధులే కలిసేవారు. ఎందుకో ఆయనకు నా మీద ఇష్టం ఏర్పడింది. నేను సినిమా ఫీల్డ్‌కు సంబంధం లేని వారిని పెళ్లి చేసుకోవాలని నా కెరీర్ తొలినాళ్లలోనే నిర్ణయించుకున్నాను. అదే జరిగినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
రంభ, ఇంద్రకుమార్ రిసెప్షన్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం చెన్నైలోని రాణీ మెయ్యమ్మా హాలులో జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులతో పాటు రాజకీయరంగ ప్రముఖులు కూడా ఈ రిసెప్షన్‌లో పాల్గొనబోతున్నారు. ఈ వారంలోనే రంభ, ఇంద్రకుమార్ హనీమూన్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లనున్నారు.అలాగే వివాహానంతరం నటన గురించి ప్రస్దావిస్తూ..."హుందా అయిన పాత్రలు వస్తే చేయాలని ఉంది. అయితే ప్రస్తుతానికి నా మైండ్‌లో ఎలాంటి సినిమా ఆలోచనలూ లేవు' అని స్పష్టం చేశారామె.


Click it and Unblock the Notifications











