సెక్స్ స్కామ్ లో నన్నలా ఇరికించారు : రంజిత
వీడియోలో కనిపించింది నేనే. ఆయనకు భార్యలా పాదసేవతోపాటు మాత్రలివ్వడం, భోజనం తినిపించడం వంటి సపర్యలుచేశాను తప్ప శృంగారంలో పాల్గొనలేదు . నేను చేసిన సేవల దృశ్యాలు మార్ఫింగ్ మాయతో అశ్లీల చిత్రంలా రూపొందించి ఇరికించారు అంటూ చెప్పుకొచ్చింది సినీ నటి రంజిత. రాసలీల సాగిస్తూ వీడియో కెమెరాకు చిక్కిన స్వామి నిత్యానందకేసులో పరారై కేరళలో ఉన్న ఆమె తాజాగా ఓ తమిళ పత్రికకు ఇంటర్వూ ఇస్తూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే స్వామి ఏనాడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. అలాగే స్వామి మరో వారంలోగా స్వయంగా వాస్తవాలు వెల్లడిస్తారని వివరించింది. ఇక తను ఆయన్ని ఆశ్రయించటానికి కారణం చెపుతూ.. చిన్నతనం నుంచీ తనను పీడిస్తున్న శ్వాసకోశ వ్యాధిని ఒక్కరోజులో తగ్గించినందువల్లే ఆయనకు పరమ భక్తురాలిగా మారానన్నారు. తనపై మీడియాలో దు ష్ప్రచారం సాగుతున్నదని, ఇది న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆమె చెప్పేది నిజమేనంటారా..


Click it and Unblock the Notifications











