ఆ చిత్రంలో రోజా ఐటం సాంగ్
సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది. ఆ చిత్రంలో హీరోయిన్ తల్లిగా రోజా చేసింది.ఆమెకు ఎప్పటినుంచో కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనే కోరిక.అది తీరటం ఒకెత్తు అయితే ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్.. అది కూడా ఈ చిత్రంతో తీరింది అంటున్నారు. ఈ చిత్రంలో రోజాది మంత్రి పాత్ర. ఇక రోజా వంటి సీనియర్ నటి నటించటం వల్ల ఆ పాత్రకు నిండుతనం వచ్చిందని అంటున్నారు.సినిమా రిజల్టు నెగిటివ్ గా ఉన్నా రోజా పాత్ర మాత్రం హైలెట్ అయ్యింది.
ఆ పాత్ర స్పూర్తితో ఆమెకు మరిన్ని పాత్రలు వస్తాయంటున్నారు. నెగిటివ్ గా కనిపించే సాప్ట్ రోల్ మినిస్టర్ పాత్ర అది.ఇక ఇంతకుముందు కూడా ఆమె రవితేజ హీరోగా చేసిన శంభో శివ శంబో చిత్రంలో ఇటువంటి తరహా పాత్రనే చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా మాత్రం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవటంతో ఆమె పాత్ర గురించి అందరిలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటువంటి పొలిటేషన్ పాత్రలు వస్తే ఆమె ఎట్టి పరిస్ధితిల్లోనూ వదులుకోదు అంటున్నారు. మరి తమిళంలో ఆమె డాన్స్ చేస్తే అది హిట్టైతే తెలుగులోనూ ఆమె చేత ఐటం సాంగ్స్ చేయిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











