ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంగీత
సంగీతకు సన్నిహిత స్నేహితురాలైన ప్రముఖ నటి ఖుష్భూ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు...ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పింది. "Hey @Krrishsinger n Sanu congratulations at the arrival of an angel who will add more love to ur family...loads of love to the mother n baby." అంటూ ట్వీట్ చేసింది.
మరో వైపు యాక్టర్ జీవా కూడా ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసారు. తల్లి-తండ్రి పోస్టు పొందిన క్రిష్-సంగీత జీవితం మరింత ఆనందంగా గడవాలని యాక్టర్ జీవా ఆకాంక్షించాడు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
'కాదలె నిమ్మది' అనే తమిళ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత ఇప్పటి వరకు పలు దక్షిణాది భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. కొన్ని సంవత్సరాల పాటు క్రిష్‌తో ప్రేమాయణం కొనసాగించిన సంగీత 2009లో క్రిష్ ను తమిళనాడులోని దేవాలయంలో వివాహం చేసుకుంది.


Click it and Unblock the Notifications












