twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంగీత

    By Bojja Kumar
    |

    చెన్నయ్ : ఖడ్గం, పెళ్లాం ఊరెలితే, విజయేంద్ర వర్మ, నవ్వుతూ బతకిలిరా చిత్రాలతో పాటు తెలుగు దాదాపు 20 చిత్రాల వరకు నటించిన హీరోయిన్ సంగీత ఆ మధ్య సింగర్ క్రిష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. తాజాగా ఇద్దరు తల్లిదండ్రులయ్యారు. నిన్న(డిసెంబర్ 3)న సంగీత ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

    సంగీతకు సన్నిహిత స్నేహితురాలైన ప్రముఖ నటి ఖుష్భూ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు...ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పింది. "Hey @Krrishsinger n Sanu congratulations at the arrival of an angel who will add more love to ur family...loads of love to the mother n baby." అంటూ ట్వీట్ చేసింది.

    మరో వైపు యాక్టర్ జీవా కూడా ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసారు. తల్లి-తండ్రి పోస్టు పొందిన క్రిష్-సంగీత జీవితం మరింత ఆనందంగా గడవాలని యాక్టర్ జీవా ఆకాంక్షించాడు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

    'కాదలె నిమ్మది' అనే తమిళ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత ఇప్పటి వరకు పలు దక్షిణాది భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. కొన్ని సంవత్సరాల పాటు క్రిష్‌తో ప్రేమాయణం కొనసాగించిన సంగీత 2009లో క్రిష్ ను తమిళనాడులోని దేవాలయంలో వివాహం చేసుకుంది.

    English summary
    Chennai: Actress Sangeetha and singer Krish have welcomed a new member to their family. Well, the couple, who tied the knot three years ago, has become proud parents for the first time. Sangeetha delivered a baby girl on Monday (December 3). She gave birth to the baby at a private hospital, and wishes are pouring in from every corner for the couple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X