twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తపై కేసు పెడతానంటున్న మాజీ తెలుగు హీరోయిన్

    By Srikanya
    |

    Saritha
    చెన్నై : తన చట్టవిరుద్ధంగా తన భర్త (మలయాళ నటుడు ముఖేష్‌) రెండో వివాహం చేసుకున్నారని.. ఆయనపై కేసు పెట్టనున్నట్లు సినీనటి సరిత పేర్కొన్నారు. మరోచరిత్ర, కోకిలమ్మ, అచ్చమిల్త్లె అచ్చమిల్త్లె తదితర చలన చిత్రాల్లో నటించి ఆమె గుర్తింపు పొందారు. ఆమె సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. అభిప్రాయభేదాల కారణంగా తాను, భర్త వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలిపారు.

    తన మొదటి కుమారుడు షర్వన్‌ దుబాయ్‌లో వైద్య కోర్సు చేస్తున్నాడని, రెండో కుమారుడు తేజస్సు డిగ్రీ చదువుతున్నాడని వివరించారు. వారికి తోడుగా తాను కూడా అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన భర్త ముఖేష్‌ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై తాను ముఖేష్‌పై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.

    సరిత చెప్పిన వివరాల ప్రకారం... 1988 ముఖేష్‌ మాధవన్‌తో కేరళలో సరిత వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 2007లోనే ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ సరిత కోర్టుకు వెళ్లగా....ముఖేష్ విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత 2009లో పరస్పర అంగీకారంతో కూడిన విడాకులు కోరుతూ చెన్నరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. అయితే ముఖేష్ కోర్టుకు సరిగా హాజరుకాని కారణంగా....ఆమె ఆ పిటీషన్ 2010లో ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం సరిత ఇద్దరు కుమారులు శ్రవణ్, తేజా్ దుబాయ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారి ఆలనా పాలన చూస్తు వారితో పాటే ఉంటున్నారు సరిత.

    English summary
    Malayalam actor Mukesh marries the profound dancer Methil Devika. They got married at Mukesh's residence at Maradu and officially signed the marriage papers at the Tripunithara Register Office. Mukesh first wife Saritha calls Mukesh's marriage illegal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X