షకీలా కూతుర్ని చూస్తే షాకవ్వాల్సిందే.. ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎమోషనల్
సినిమా పరిశ్రమలో ప్రముఖ తారలు తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా సీక్రెట్‌గా కొనసాగిస్తుంటారు. తమ లైఫ్‌కు సంబంధించిన విషయాలు బయడపెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే విషయంతో అభద్రతాభావానికి లోనవుతారు. అయితే చాలా ఏళ్ల తర్వాత నటి షకీలా తన వ్యక్తిగత జీవితంలోని సంఘటనలను, తన పెంపుడు కూతురు విషయాలను ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

సుస్మితా సేన్, రవీనా టాండన్ దారిలో
సినిమా పరిశ్రమలో చాలా మంది తారలు పెళ్లి కాకుండానే పిల్లలను దత్తత తీసుకోవడం తెలిసిందే. సుస్మితాసేన్, రవీనా టాండన్ లాంటి తారలు పెళ్లికి ముందే ఆడపిల్లలను దత్తత తీసుకొని వారి పాలన, పోషణ చూసుకొంటున్నారు. తాజాగా షకీలా కూడా తన పెంపుడు కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది.

వివాహానికి దూరంగా షకీలా
నటి షకీలా విషయానికి వస్తే.. ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు. వ్యక్తిగత జీవితంలో లవ్ ఫెయిల్యూర్స్‌తో మనస్తాపం చెందిన ఆమె వివాహానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మిల్లా అనే ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకొన్నారు. అప్పటి నుంచి తన సొంత కూతురిలా చూసుకొంటున్నారు.

కూతురే ప్రపంచంగా
తన కూతురు మిల్లానే ప్రపంచంగా భావించి ఆమెను అల్లారుముద్దుగా పెంచింది. విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకురాలిగా మార్చింది. ప్రస్తుతం మిల్లా సినీ పరిశ్రమలో క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని తమిళ టెలివిజన్ ఛానెల్‌లో షకీలా ప్రేక్షకులతో పంచుకొన్నారు.

షకీలా భావోద్వేగంతో
తన కూతురు మిల్లా గురించి చెబుతూ నటి షకీలా భావోద్వేగానికి లోనయ్యారు. మిల్లా నాకు సర్వస్వం. నా జీవితంలో ఎదురైన కష్ట సమయాల్లో నాకు మానసికంగా స్థైర్యాన్ని ఇచ్చింది. నాకు కొండంత అండగా నిలిచింది. ఏ సమయంలోనైనా నాకు ఆమె అండగా నిలుస్తుంది అని షకీలా పేర్కొన్నది.

షకీలా కెరీర్ ఇలా..
షకీలా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించిన దాఖలాలు లేవు. కానీ తాజాగా తమిళంలో కుక్కు విత్ కోమలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో తన ఇమేజ్‌కు భిన్నంగా తల్లి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై తమిళంలో మంచి బజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











