చివరి క్షణం వరకు ప్రయత్నించా.. నీ మరణంతో గుండె ముక్కలు. నటి చిత్ర ఫ్రెండ్ ఎమోషనల్ పోస్టు

టెలివిజన్ యాంకర్, నటి వీజే చిత్ర మరణం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెతో చివరి రోజు వరకు పనిచేసిన వాళ్లు తమ అభిప్రాయాలను, సరికొత్త వాదనలను తెరపైకి తెస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీజే చిత్ర చెన్నై శివారులోని ఓ హోటల్‌లో ఉరివేసుకొని మరణించడం స్థానికంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. వీజే చిత్ర మరణంపై తమిళ నటి షాలు షమ్ము వెల్లడించిన విషయాలు మరింత అనుమానాస్పదంగా మారాయి. చిత్ర వ్యక్తిగత జీవితం, కేసుకు సంబంధించిన వివారాల్లోకి వెళితే...

సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్

సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్

వీజే చిత్రం వివాహా నిశ్చితార్థం ఆగస్టు నెలలో హేమంత్ కుమార్‌తో జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే వారిద్దరు తమ పెళ్లిని బహిరంగంగా, అధికారికంగా వెల్లడించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గొంతు, దేహంపై గాయాలు

గొంతు, దేహంపై గాయాలు

తొలుత వీజే చిత్ర మరణాన్ని తొలుత ఆత్మహత్యగా భావించారు. అయితే ఆమె గొంతు, దేహంపై గాయాలు ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిత్ర తల్లి, తండ్రి తన కూతురు మరణంపై సందేహాలు వ్యక్తం చేశారు. తన కూతురు ధైర్యవంతురాలు.. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేంత బలహీనురాలు కాదు అని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆర్డీవో స్థాయి దర్యాప్తును మొదలైంది.

చిత్రను పలుమార్లు హెచ్చరించా

చిత్రను పలుమార్లు హెచ్చరించా

ఇదిలా ఉండగా, వీజే చిత్రతో ఉన్న అనుబంధాన్ని నటి షాలు షమ్ము తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. చిత్రను ఈ విధంగా దూరం చేసుకొంటానని అనుకోలేదు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని పలుమార్లు హెచ్చరించాను. ఫోన్‌ చేసి కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను. అయినా నా ప్రయత్నాలు ఇలా విఫలం అవుతాయని అనుకోలేదు అని షాలు తన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు.

Recommended Video

తమిళ నటి VJ Chitra ఇక లేరు | Pandian Stores తో భారీ క్రేజ్..!!
జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు

జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు

కొద్ది రోజులుగా మానసికంగా ఏదో సంఘర్షణకు గురి అవుతుంటే.. నేను ఓదార్చే ప్రయత్నం చేశాను. నీ జీవిత భాగస్వామితో జరిగిన గొడవల వల్ల మనస్తాపం చెందావని తెలుసు. దాని వల్ల నీ లైఫ్‌కు సంబంధించి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను. ఇలాంటి దారుణానికి పాల్పడుతావని తెలిస్తే.. మొదట్లోనే ఆపివేసి.. ఇంత వరకు రాకుండా చేసేదాన్ని. నీ మరణంతో నా గుండె ముక్కలైంది. నీ ఆత్మకు శాంతి కలగాలి చైతూ అంటూ షాలు తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆవేదనను వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X