ఆ సూపర్‌స్టార్ చేత నిర్మాత కాళ్లు పట్టించారు.. ఆ తర్వాత ఫ్యాన్స్ దారుణంగా.. నటి శోభనకు షాక్!
సూపర్ స్టార్ హీరోలకు కొన్ని సీన్లలో నటించాలంటే ముందు వెనుక ఆలోచిస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులతో తట్టుకోవడం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో పలు సీన్లలో నటించడానికి జంకుతారు. ఇక హీరోయిన్లతో చేసే సన్నివేశాల్లో మరీ జాగ్రత్తగా ఉంటారు. ఏకంగా రజనీకాంత్‌తో జరిగిన ఓ సంఘటనను శోభన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకు రజనీకి ఇబ్బందిగా మారిన సీన్ ఏమిటంటే..

20 వయసులో రజనీకాంత్‌తో
నా వయసు 20 సంవత్సరాలు. ఆ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం లభించింది. అమీర్‌జాన్ దర్శకత్వం వహించిన శివ చిత్రంలో ఆయన పక్కన నటించాను. ఆ సమయంలో ఓ సన్నివేశంలో నటించడానికి రజనీకాంత్ ముందు వెనుక ఆలోచించారు. అయితే అలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కాలేదు అని శోభన చెప్పారు.

నా కాళ్లు పట్టుకోవడానికి సందేహించారు
శివ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఆ షూటింగ్‌లో భాగంగా ఓ సీన్‌లో రజనీకాంత్ నా కాళ్లు పట్టుకోవాలి. అయితే ఆ సీన్ చేయడానికి సందేహిస్తూ డైరెక్టర్, నిర్మాతకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సీన్ కోసం ఎందుకంత ఆలోచిస్తున్నారు. అందులో ఏముందని నేను అనుకొన్నాను అని శోభన చెప్పారు.

నిర్మాత ఒప్పించడంతో
దర్శకుడు, నిర్మాత నచ్చచెప్పిన తర్వాత నా కాళ్లను పట్టుకొనే సీన్‌లో రజనీకాంత్ నటించారు. ఆ తర్వాత కూడా రజనీకాంత్ ఎందుకు నిరాకరించారు అనే విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఓ సూపర్‌స్టార్ అలాంటి సీన్‌ను ఎందుకు చేయకూడదనే విషయం సినిమా రిలీజైన తర్వాత నాకు చాలా సులభంగా అర్ధమైంది అని శోభన తెలిపారు.

సినిమా రిలీజ్ తర్వాత రచ్చ..
రజనీ సార్, నేను నటించిన శివ సినిమా రిలీజైంది. రిలీజైన మరుసటి రోజు నుంచే ఆ సీన్ వివాదాస్పదమైంది. రజనీకాంత్ సార్ అభిమానులు రెచ్చిపోయారు. నన్ను దుర్బాషలాడుతూ మెయిల్స్ రాశారు. రజనీకాంత్‌ను నీవు కాళ్లను ఎలా తాకనిచ్చావు అంటూ నానా రచ్చ చేశారు. అలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఎందుకు వెనుక ముందు ఆలోచించారో అర్ధమైంది అని శోభన చెప్పారు.
Recommended Video

రజనీకాంత్‌తో రెండు సినిమాలు
రజనీకాంత్‌తో శివ సినిమాలో నటించిన తర్వాత శోభన ఆయనతో రెండు సినిమాల్లో నటించారు. సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన దళపతి చిత్రంలో నటించారు. ఆ తర్వాత రజనీకాంత్ కూతురు సౌందర్య రాజేశ్ తీసిన కొచ్చడయాన్ చిత్రంలో ఆయనతో కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











