మనం కాదనుకున్నా అక్కడ కేక పెట్టిస్తోంది
భద్రాచలం చిత్రం నుండి చిన్నా చితకా చిత్రాల్లో చేస్తూ ఎట్టకేలకు చందమామతో అందరి దృష్టిలో పడ్డ భామ సింధుమీనన్. ఆమెకు మంచి ఎక్సప్రెషన్స్ ఇచ్చే ఫేస్ ఉన్నా అవకాశాలు మాత్రం రాలేదు.చందమామ తర్వాత చేసిన రెయిన్ బొ చిత్రం వర్కవుట్ కాలేదు. దాంతో చాలా ఎక్సపెక్ట్ చేసింది కానీ ఎక్కడా బుక్ కాలేదు. అయితే తమిళంలో వారు మాత్రం ఆమెలో టాలెంట్ గుర్తించినట్లున్నారు. అక్కడ రీసెంట్ గా చేసిన ఈరమ్ అనే ధ్రిల్లర్ సూపర్ హిట్ కావటంతో వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. తమిళ తంబిలు ఆమె డేట్స్ కోసం తిరుగుతున్నారు. అయితే ఎట్టకేలకు వచ్చిన అవకాశం కావటంతో ఆమె కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఇప్పటికైనా నిలబడే ప్రయత్నం చేస్తోందని సమాచారం. అలాగే ఈరమ్ చిత్రాన్ని ఇక్కడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ సింధు.
సింధు మీనన్ చందమామ కృష్ణవంశి శ్రీరామచంద్రులు త్రినేత్రం భద్రాచలం ఈరమ్ ధ్రిల్లర్ రెయిన్ బొ sindhu menon chandamama eeram bhadrachalam rainbow krishna vamsi


Click it and Unblock the Notifications