స్నేహ లవర్ అతనే!?
హోమ్లీ హీరోయిన్ గా పాపులర్ అయిన స్నేహ ఈ మధ్యన ఓ డైరక్టర్ తో ప్రేమలో పడి వార్తల్లో కెక్కింది. అతను మరెవరో కాదు ఆమెతో భవాని ఐపియస్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న కిచా. అతని డైరక్ట్ చేస్తున్నప్పుడే అతని టాలెంట్ చూసి ఆమె మైమర్చిపోయేదని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. అలాగే అతని పేర ఆమె చెన్నైలోని ఓ గుళ్ళో పూజలు చేయించటం కూడా ఆమధ్య ఓ వార్తయింది.
దానికామె తన సినిమా కిచా డైరక్ట్ చేస్తున్నాడని అతను బాగుంటే తాము బాగుంటామనే అలా చేసామని చెప్పుకొచ్చింది. అయితే రాత్రిళ్ళు లేట్ నైట్ దాకా పార్టీలు కెళ్ళటం, ఫోన్ ల్లో మాట్లాడటం చూసి ఆమె ఇంట్లో వాళ్ళు నిలదీసారు. అలాగే ఈ మధ్య ఓ నటుడు కుమార్తె పెళ్ళికి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఒకరి చేతిలో మరొకరు చేయివేసుకుని వచ్చారు. ఇది అప్పుడే అందరిలో ఆసక్తి కలుగచేసింది. త్వరలోనే పెళ్ళి చేసుకుంటారని వినవచ్చింది. అయితే స్నేహ, కిచా ఇద్దరూ ఈ విషయంపై పెదవి విప్పటం లేదు.


Click it and Unblock the Notifications