నాతో పడుకొంటావా? నిన్ను చూస్తే మూడొస్తుంది.. ఎంత అంటే అంత ఇస్తా.. యువనటికి చేదు అనుభవం!
సోషల్ మీడియాలో సినీ తారలకు చేదు అనుభవాలను ఎదురవ్వడం, ట్రోలింగ్ గురికావడం సర్వసాధారణంగా మారింది. తమకు జరిగిన సంఘటనలను చెప్పుకొంటూ వారి తీరును ఎండగట్టడం ద్వారా పలువురు తారలు ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటికి దారుణమైన సంఘటన ఎదురైంది. తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకు ఈ నటి ఎవరు? ఆమెను ఓ లెక్చరర్ ఎలా వేధించాడనే విషయంలోకి వెళితే...

కాలేజ్ లెక్చరర్ వేధింపులు
తమిళ నటి సౌందర్య నందకుమార్ ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తు ఆకట్టుకొంటున్నారు. తాజాగా దళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. అంతేకాకుండా పలు టెలివిజన్ సీరియల్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకొంటున్నారు. తాజాగా ఓ లెక్చరర్‌ను తీవ్రంగా వేధించారు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

నిన్ను చూస్తే మూడోస్తుంది..
ఇన్స్‌టాగ్రామ్‌లో తాను లెక్చరర్ అని పరిచయం చేసుకొన్నాడు. నిన్ను చూస్తే నాకు చాలా మూడ్ వస్తున్నది. నాతో పడుకొంటావా? నీకు ఏమి కావాలంటే అది ఇస్తా. జస్ట్ నాతో పడుకోవాలి అంటూ నాకు మెసేజ్ పంపాడు. దాంతో నాకు షాక్ తగిలినంత పనైంది అంటూ సౌందర్య నందకుమార్ తెలిపారు.

నాతో పడుకొంటావా? అంటూ..
ఇన్స్‌టాగ్రామ్ లైవ్ ద్వారా తనతో మాట్లాడుతూ.. నాతో పడుకొంటావా? అని అడిగాడు. దాంతో నాకు మైండ్ దిమ్మతిరిగింది. ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి. దాంతో ఆయనను గట్టిగా మందలించాను. ఆయనపై కంప్లైట్ చేస్తాను. సమాజంలో గౌరవప్రదమైన ప్రొఫెషన్‌లో ఉన్న ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అంటూ సౌందర్య నందకుమార్ పేర్కొన్నారు.

ట్రాక్ చేస్తున్నాను అంటూ..
నాతో అంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నాను. సరైన పద్దతిలో నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఆయన నాతో చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీశాను. ప్రస్తుతం అతడు నన్ను బ్లాక్ చేశాడు. ఆ లెక్చరర్ పనిచేసే కాలేజి యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేస్తాను అని సౌందర్య నందకుమార్ తెలిపారు.

లెక్చరర్‌కు బుద్ది చెబుతా
సమాజానికి చీడపురుగుగా మారే ఆ వ్యక్తిని పట్టుకొంటాను. అతడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొనేలా గట్టిగా బుద్ధి చెబుతాను. బాధ్యతాయుతమైన ప్రొఫెషన్‌లో ఉన్న వ్యక్తి ఓ మహిళతో ప్రవర్తించే తీరు అదేనా అంటూ సౌందర్య నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి...
తనతో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ గురించి సౌందర్య స్పందిస్తూ.. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు ఇలాంటి వారికి సాధ్యమైనంత దూరం ఉండాలి అంటూ సౌందర్య నందకుమార్ సలహాలు, సూచనలను ఇచ్చారు. సౌందర్య ధైర్యాన్ని మెచ్చుకొంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Recommended Video

సౌందర్య నందకుమార్ కెరీర్ ఇలా
సౌందర్య నందకుమార్ కెరీర్ విషయానికి వస్తే.. సింగర్‌గా తమిళ సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. సూపరస్ సింగర్ 3, 4, 5 షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్ తమిళం 3లో గెస్టుగా వెళ్లారు. ఇక సినిమాల విసయానికి వస్తే కబాలి, మాస్టర్, వణక్కం దా మాఫ్పిల్లీ సినిమాలో నటించింది.


Click it and Unblock the Notifications











