మద్యం మత్తులో సీనియర్ హీరోయిన్.. హోటల్ రూంలో దర్శక, నిర్మాతల అత్యాచారయత్నం..అసలేం జరిగిందంటే?

ఆడది కనిపిస్తే చాలు ఆమెను కింద నుంచి పై వరకు గుచ్చి గుచ్చి చూస్తూ చూపులతోనే చంపేస్తారు కొందరు మగాళ్లు. ఆఫీసులో, రోడ్డుపై చివరికి ఇంట్లోనూ ఆమెకు రక్షణ లేకుండా పోతోంది. ఏ కామాంధుడు ఏ వైపు నుంచి వచ్చి కాటేస్తాడో తెలియక మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారుల నుంచి రేపో మాపో పోయే వృద్ధురాళ్ల వరకు ఈ కీచకులు వదిలిపెట్టడం లేదు. ఇక అవకాశాలు ఇస్తామనో, బలహీనతలను అదనుగా చేసుకుని ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారు. సినీరంగంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతాయని అంతా అంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్‌లుగా వెలుగొందుతున్న వారు సైతం ఇలాంటి వారి చేతిలో బాధితులు కావడం దురదృష్టకరం.

చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ..దాదాపు పాతికేళ్లుగా హీరోయిన్‌గా కొనసాగు స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేటికీ తిరుగులేని నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారామె. ఎప్పటికప్పుడు ఆ హీరోయిన్ పని అయిపోంది అని అనుకొన్న ప్రతీ సారి ఆమెకు ఇక ఢోకా లేదురా అనిపించుకుంటున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని ఆమె భావించారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారవేత్తతో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అవ్వగా.. అనూహ్య కారణాలతో నిశ్చితార్ధం రద్దయ్యింది.

actress Star Heroine escaped from rape attempt when she was Alcohol intoxication

అయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఇటీవల ఆమె నటించిన సినిమాలకు దేశవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. 40 ప్లస్‌లోనూ ఇంత గ్లామరస్‌గా ఎలా ఉండగలుగుతున్నారంటూ అభిమానులే ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అగ్ర హీరోలతో కలిసి భారీ ప్రాజెక్ట్‌ల్లో ఆమె నటిస్తున్నారు.

ఇప్పుడంటే అవకాశాలు సీనియర్ స్టార్ హీరోయిన్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి కానీ.. ఒకానొక దశలో ఆమె చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. వయసు పైబడటం, కొత్త అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉండటంతో సీనియర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో వ్యసనాలకు బానిసై మద్యం తాగుతూ గడిపేదట.

ఎవరైనా పిలిచి అవకాశం ఇవ్వకపోతారా అన్న ఆశతో ఉన్న వేళ.. ఓ రోజున ముంబై నుంచి ఓ నిర్మాత ఫోన్ చేసి మంచి స్క్రిప్ట్ రెడీగా ఉంది, మీరు వస్తే మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని చెప్పారట. ఎడారిలో ఒయాసిస్ కనిపించినట్లు ఆ మాటలు సదరు హీరోయిన్‌కు ఆనందాన్నిచ్చాయి. వెంటనే మరో మాట లేకుండా ఫ్లైట్‌లో ముంబై చేరుకున్నారట.

actress Star Heroine escaped from rape attempt when she was Alcohol intoxication

అక్కడ సదరు దర్శకుడిని కలవగా.. ఆయన ఓ సిటీలో మన నిర్మాత ఉన్నారు అక్కడికి వెళ్లి కరెమ్యునరేషన్ తదితర విషయాలపై మాట్లాడుకుందామని చెప్పాడట. ఆ మాటలు విని ఆయనతో పాటే ఆ నగరానికి వెళ్లి ఓ స్టార్ హోటల్‌లో ఉన్న నిర్మాతను కలిసిందట. అనంతరం వాళ్లు పార్టీ ఆఫర్ చేయడంతో అందుకు ఆమె వెంటనే ఓకే చెప్పారట. అయితే పార్టీలో తన డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో తన చుట్టు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆమె వెళ్లారట.

స్టార్ హీరోయిన్ పరిస్థితి చూసిన ఆ నిర్మాత, డైరెక్టర్ ఆమెపై అఘాయిత్యం చేయబోయారట. వాళ్లు చేయి వేయగానే, అలాంటి పరిస్ధితుల్లోనూ వెంటనే తేరుకుని బిగ్గరగా కేకలు వేయగా హోటల్ సిబ్బంది వచ్చి దర్శక నిర్మాతలకి బుద్ధి చెప్పారట. అలా అగ్రతార తన జీవితంలో ఓ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ సీనియర్ హీరోయిన్‌ ఎవరు? లైంగిక దాడికి యత్నించిన ఆ ఇద్దరు ఎవరనేది గుట్టుగానే ఉంచారు. ఈ వార్త మాత్రం సినీ వర్గాల్లో సంచలనం అప్పట్లో సంచలనం రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X