హీరోయిన్ ఆత్మ హత్యాయత్నం(ఆ డైరెక్టర్ వల్లనే?)

By Bojja Kumar

చెన్నయ్: తమిళ హీరోయిన్ సుజి బాలా నిద్ర మాత్రలు మింది ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు విషయం గ్రహించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఆగస్టు 25 జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సుజి బాలా ఆత్మహత్యా యత్నానికి గల కారణం ఇంకా తెలియ రాలేదు. అయితే తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం తన పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్లతో వచ్చి గొడవ నేపథ్యంలోనే ఈమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సుజి బాలాకు ఆగస్టు 27న దర్శకుడు రవికుమార్‌(తమిళ చిత్రం ఉన్మయ్ ఫేం)తో తిరుచానూర్ టెంపుల్‌లో పెళ్లి జరుగాల్సి ఉంది. ఈ తరుణంలో సుజి బాలా ఆత్మహత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ దర్శకుడితో పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ ఊహించని పరిణామంతో ప్రస్తుతానికి పెళ్లి రద్దయింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యలు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X